Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా దేవరకొండలో ముగ్గురు.. సత్యసాయి జిల్లాలో నలుగురు మృతి
రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తంగా ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు.
Hyderabad, Dec 21: రోడ్డు ప్రమాదాలతో (Road Accidents) తెలుగు రాష్ట్రాలలోని (Telugu States) రహదారులు శనివారం తెల్లవారుజామున నెత్తురోడాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తంగా ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా దేవరకొండలో (Devarakonda) శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివార్లలోని పెద్ద దర్గా వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టి అనంతరం ఓ స్వీట్ షాప్ లోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అబ్దుల్ ఖాదర్, హాజీ, నబీనగా గుర్తించారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.
హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు (వీడియో)
Here's Video:
సత్యసాయి జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం తెల్లవారుజామున మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గుడిబండ, అమరాపురం మండలాలకు చెందిన 14 మంది మినీ వ్యాన్ లో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి మళ్లీ తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున మడకశిర మండలం బుళ్లసముద్రం వద్ద ఆగి ఉన్న లారీని వారి వాహనం ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్ లో ప్రయాణిస్తున్న 14 మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కేటీఆర్ పై మరో కేసు నమోదు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ