Telugu Students Died in USA: చదువు పూర్తయిన సంతోషం క్షణ కాలమైనా ఉండలేదు.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత.. ఆరిజోనాలోని జలపాతంలో పడి దుర్మరణం.. మృతులు రాకేశ్ రెడ్డి, రోహిత్ గా గుర్తింపు
తాజగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతున్నది.
Newdelhi, May 12: అమెరికాలో (America) భారతీయ విద్యార్థుల మరణాలు (Indian Students Dead) తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృత్యువాతపడ్డారు. ఆరిజోనా యూనివర్సిటీ నుంచి ఇటీవలే ఎంఎస్ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి (23), రోహిత్ మణికంఠ రేపాల (25) అనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎంఎస్ పట్టా అందుకున్న వీళ్లు చదువు పూర్తయిన సంతోషంలో కాస్త ఉల్లాసంగా గడపడానికి ఈ టూర్ కి వెళ్లినట్టు సమాచారం.
ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన చంద్రశేఖర్ రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు రాకేశ్ రెడ్డి అని తెలిసింది. రోహిత్ మణికంఠకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.