Jagan Offered Dy CM Post To Vanga Geetha: వంగా గీత‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్, చివ‌రి రోజు ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీల‌క హామీ ఇచ్చిన జ‌గ‌న్
Cm Jagan (Photo-Video Grab)

Kakinada, May 11: ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు పిఠాపురంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్‌ (CM Jagan) సంచలన ప్రకటన చేశారు. వంగా గీతను (Vanga Geetha) గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. అలాగే కుప్పంలో భరత్‌ గెలస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురంలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో జగన్‌ మాట్లాడుతూ.. చిన్న జలుబు చేస్తేనే పిఠాపురం నుంచి హైదరాబాద్‌కు పారిపోయాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా అని ప్రశ్నించారు. ఆయన్ను మహిళలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఐదేండ్లకు ఒకసారి కార్లు మార్చినట్లుగా దత్తపుత్రుడు భార్యలను మార్చేస్తాడని విమర్శించారు. ఈయన ఎమ్మెల్యే అయితే మహిళలు కలిసే పరిస్థితి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇప్పటికే గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం మిగిలిందని ఎద్దేవా చేశారు.

 

కాగా, ఈ మీటింగ్‌లోనే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ఎమోషనల్‌ అయ్యారు. తాను పిఠాపురంలో పుట్టలేదని అవమానిస్తున్నారని.. నియోజకవర్గానికి దూరం చేస్తున్నారని కంటతడి పెట్టారు. పిఠాపురమే తన కుటుంబమని.. తన అంతిమ యాత్ర కూడా ఇక్కడే జరగాలని తెలిపారు. మళ్లీ పిఠాపురంలోనే పుట్టి మీ రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తన బిడ్డ సాక్షిగా ప్రమాణం చేశారు.