Weather Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

Telangana rain alert Heavy Rains in Hyderabad for the Next Three Days(X)

Vijayawada, Oct 18: తెలుగు రాష్ట్రాలపై (Telugu States) వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు (Heavy Rains), రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, గురువారమే వాయుగుండం తీరం దాటడంతో ఇక ముప్పు వీడిందని ప్రజలు భావిస్తుండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో వచ్చే మంగళవారం రోజున మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 80.5 మిమీ, విశాఖ రూరల్ లో 62.2 మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరులో 60.7 మిమీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

వారు 3 నెలలు అక్కడ ఉంటే మూసీ నది ప్రాజెక్ట్‌ను ఆపేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని మండిపాటు

శుక్రవారం రోజున

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, హైదరాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రిలీవ్ అయిన ప్రస్తుత క‌మిష‌న‌ర్‌ ఆమ్ర‌పాలి

శనివారం రోజున

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif