Hyderabad Horror: హైదరాబాద్‌ లో భర్తను హత్య చేసి ఊటీ ఎస్టేట్‌ లో తగులబెట్టిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం

ప్రియుడి సాయంతో అతని భార్యే ఈ ఘాతుకానికి తెగిపడింది.

Crime (Credits: X)

Hyderabad, Oct 27: హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడి సాయంతో అతని భార్యే ఈ ఘాతుకానికి తెగిపడింది. అంతేకాదు బాధితుడు రమేశ్‌ కుమార్(54)ను హైదరాబాద్‌ సమీపంలో హత్య(Murder) చేసి కర్ణాటక పరిధిలోని ఊటీ కాఫీ ఎస్టేట్‌ లో తగులబెట్టారు. కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఉప్పల్-భువనగిరి ప్రాంతంలో ఆయనను హత్య చేసినట్లు తెలిసింది. నిందితురాలైన రమేశ్‌ కుమార్ భార్య నిహారిక, ఆమె ప్రియుడు డాక్టర్‌ నిఖిల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మనం ఎప్పుడు మరణిస్తామో ఇట్టే చెప్పేసే ‘డెత్ కాలిక్యులేటర్‌’.. బ్రిటన్‌ లో మెషీన్ ను వాడేందుకు సిద్ధమవుతున్న హాస్పిటళ్లు.. అసలు ఎలా పనిచేస్తుందంటే?

ఎందుకు చేశారంటే?

మెర్సిడెస్ బెంజ్ కారులో రమేష్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఊటీ దగ్గర వున్న కాఫీ ఎస్టేట్‌ కు నిహారిక తన ప్రియుడు మరో వ్యక్తి రాణా సాయంతో తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. 8 కోట్ల రూపాయల ఆస్తి కోసమే నిహారిక భర్తను హత్య చేయించినట్టు విచారణలో తేల్చారు. రమేష్ హత్య చేసి కాఫీ ఎస్టేట్‌ లో తగుల బెట్టిన రాణాను హర్యానాలోని ఓ డాబా వద్ద టీ తాగుతుండగా కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు, వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల ప‌రిధి పెంపు, ధ‌ర‌ణి స్థానంలో భూమాత స‌హా అనేక అంశాల‌కు ప‌చ్చ‌జెండా