Newdelhi, Oct 27: పుట్టుక, మరణం మన చేతుల్లో ఉండదంటారు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు అంటారు. అయితే, మరణాన్ని ముందుగానే కనిపెడితే ఎలా ఉంటుంది. బ్రిటన్ (Britain)కు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పడు అదే చేశారు. మనం ఎప్పుడు మరణిస్తామో ఇట్టే చెప్పేసే ‘సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ కాలిక్యులేటర్’ను (AI Death Calculator) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సింగిల్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) టెస్ట్ సాయంతో గుండె విద్యుత్తు కార్యకలాపాలను (ఎలక్ట్రికల్ యాక్టివిటీని) ఈ పరికరం రికార్డు చేస్తుంది. తద్వారా వైద్యులు సైతం గుర్తించలేని రహస్య ఆరోగ్య సమస్యలను ఈ మెషీన్ ఇట్టే గుర్తించగలుగుతుంది. బ్రిటన్ లోని హాస్పిటళ్లు ఈ డెత్ కాలిక్యులేటర్ ను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
This AI calculator can tell how close you are to death - India Today. I report. https://t.co/3rtQOEnm73
— Milan Sharma (@Milan_reports) October 25, 2024
78% కచ్చితత్వంతో..
ఏఐ-ఈసీజీ రిస్క్ ఎస్టిమేషన్(ఏఐఆర్‌ఈ) అని పిలిచే ఈ ప్రోగ్రామ్.. 10 ఏండ్లలో సంభవించనున్న మరణాల ముప్పును ఈసీజీ పరీక్ష ద్వారా కనిపెడుతుంది. 78% కచ్చితత్వంతో ఈ మెషీన్ మరణాలను గుర్తించగలుగుతున్నట్టు పరిశోధనల్లో తేలింది.