IMEI Fraud: ఒకే IMEI నంబరుతో 13 వేల ఫోన్లు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ న్యూస్ వెలుగులోకి, మొబైల్ ఫోన్ తయారీ సంస్థపై కేసు నమోదు చేసిన మీరట్ పోలీసులు
అయితే దొంగిలించిన ఫోన్ IMEIను మార్చివేసి చాలామంది ఫోన్లను అమ్మేస్తుంటారు. అయితే ఓ IMEI నంబరును 13000 ఫోన్లకు ఎక్కించడం నిజంగా షాకింగ్ కలిగించే అంశమే.. వివరాల్లోకెళితే.. ఉత్తర ప్రదేశ్ పోలీసులు భారతదేశంలో 13,000 కంటే ఎక్కువ హ్యాండ్‌సెట్‌లు ఒకే ప్రత్యేకమైన IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) పై నడుస్తున్నట్లు కనుగొన్నారు.
Meerut, June 5: దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను (mobile phones) గుర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే దొంగిలించిన ఫోన్ IMEIను మార్చివేసి చాలామంది ఫోన్లను అమ్మేస్తుంటారు. అయితే ఓ IMEI నంబరును 13000 ఫోన్లకు ఎక్కించడం నిజంగా షాకింగ్ కలిగించే అంశమే.. వివరాల్లోకెళితే.. ఉత్తర ప్రదేశ్ పోలీసులు భారతదేశంలో 13,000 కంటే ఎక్కువ హ్యాండ్‌సెట్‌లు ఒకే ప్రత్యేకమైన IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) పై నడుస్తున్నట్లు కనుగొన్నారు. అమెజాన్ పెట్టుబడులు ఒట్టి పుకారు, ఇలాంటి వార్తలు అనవసర పరిణామాలకు దారి తీస్తాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్
మీరట్ పోలీసులు ( Meerut police) తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌కు చెందిన ఓ పోలీసు అధికారి సెల్‌ఫోన్ కొద్దిరోజుల క్రితం పాడైంది. అయన దాన్ని రిపేరు చేయించారు. అయినప్పటికి అది సరిగా పనిచేయలేదు. దీంతో దాన్ని సైబర్ క్రైం విభాగానికి చెందిన ఓ సిబ్బందికి అప్పగించి, సమస్య ఎంటో చూడమన్నారు. ఈ నేపథ్యంలో ఐఎమ్‌ఈఐల విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు మొబైల్ కంపెనీ, సర్వీస్ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మీరట్ ఎస్పీ అఖిలేష్ ఎన్. సింగ్ మాట్లాడుతూ.. ‘‘ దాదాపు 13,500 ఫోన్లు ఒకే ఐఎమ్‌ఈఐ నెంబర్‌పై పనిచేస్తున్నాయి. ఇది భద్రతకు సంబంధించిన సీరియస్ సమస్య. మొబైల్ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తులు వారి స్వలాభానికి దాన్ని వాడుకునే అవకాశం ఉంది’’ అని అన్నారు.
మీరట్ పోలీసులు మొబైల్ ఫోన్ తయారీ సంస్థ మరియు దాని సేవా కేంద్రంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైందని, ఈ విషయాన్ని పరిశీలించడానికి నిపుణుల బృందాన్ని పిలిచినట్లు ఆయన తెలిపారు.