Dangourus Google Chrome Extensions: డేంజర్‌లో గూగుల్ క్రోమ్ యూజర్లు! ఈ 5 పాపులర్‌ ఎక్స్‌ టెన్షన్లు వాడుతున్నవారికి వైరస్‌ ముప్పు తప్పదు, వెంటనే డిలీట్ చేయాలంటూ హెచ్చరిక

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. మీ గూగుల్ క్రోమ్‌ (Google Chrome)లో ఇలాంటి ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారా? అయితే మీ డేటా డేంజర్‌లో ఉన్నట్టే.. వెంటనే ఆ క్రోమ్ ఎక్స్ టెన్షన్స్ (Chrome Extensions) డిలీట్ చేసేయండి. మీ విలువైన పర్సనల్ డేటా హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు సైబర్ నిపుణులు.

New Delhi, SEP 01: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. మీ గూగుల్ క్రోమ్‌ (Google Chrome)లో ఇలాంటి ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారా? అయితే మీ డేటా డేంజర్‌లో ఉన్నట్టే.. వెంటనే ఆ క్రోమ్ ఎక్స్ టెన్షన్స్ (Chrome Extensions) డిలీట్ చేసేయండి. మీ విలువైన పర్సనల్ డేటా హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు సైబర్ నిపుణులు. ఎందుకంటే.. ఫిషింగ్ సైట్‌ (Phishing Sites)లకు యూజర్లను రీడైరెక్ట్ చేసే కొన్ని ప్రమాదకర క్రోమ్ ఎక్స్‌టెన్షన్లు ఉన్నాయని గుర్తించారు. ఈ-కామర్స్ సైట్‌ల కుక్కీల (Cookies)లో Affiliate IDలను యాడ్ చేసే 5 Google Chrome Extensions విషయంలో సైబర్‌ సెక్యూరిటీ సంస్థ McAfee హెచ్చరించింది. ప్రత్యేకించి ఈ 5 ఎక్స్‌టెన్షన్‌లను 1,400,000 కన్నా ఎక్కువ మంది యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకున్నారని గుర్తించారు. ఇలాంటి ఈ క్రోమ్ యూజర్ల ప్రైవేట్ డేటాకు కూడా ముప్పు ఉందని కంపెనీ పేర్కొంది.

iPhone 14 Pro Leak: ఐఫోన్ 14 ప్రో ఫోన్ ఫీచర్స్ లీక్! శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌తో వచ్చే అవకాశం, కెమెరాపై ఫోకస్ పెట్టిన యాపిల్ కంపెనీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేసేలా మొబైల్స్ తయారీ, ఇంకా లీకైన ఫీచర్స్ ఇవే! 

నెట్‌ఫ్లిక్స్ (8లక్షల మంది యూజర్లు), నెట్‌ఫ్లిక్స్ పార్టీ 2 (300,00 మంది యూజర్లు), ఫ్లిప్‌షాప్ ప్రైస్ ట్రాకర్ ఎక్స్‌టెన్షన్ (8వేల మంది యూజర్లు), ఫుల్ పేజీ స్క్రీన్‌షాట్ క్యాప్చర్ స్క్రీన్‌షాటింగ్ (2లక్షల యూజర్లు), AutoBuy ఫ్లాష్ సేల్స్ (20వేల మంది యూజర్లు) Chrome స్టోర్‌లో Extensions అందుబాటులో ఉన్నాయని McAfee గుర్తించింది. అయితే యూజర్లు తమ PCలలో ఇన్‌స్టాల్ చేస్తే.. వెంటనే Remove చేయండి.ఈ ఐదు Extensions ఒకే విధంగా ఉన్నాయని McAfee వెల్లడించింది. వెబ్ యాప్ మల్టీఫంక్షనల్ స్క్రిప్ట్ (B0.js)ని లోడ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

RIL AGM 2022: జియో నుంచి అల్ట్రా-అఫర్డబుల్ 5G స్మార్ట్‌ఫోన్‌, గూగుల్‌తో కలిసి జియో పనిచేస్తోందని తెలిపిన అధినేత ముఖేశ్‌ అంబానీ 

బ్రౌజింగ్ డేటా కంట్రోల్ డొమైన్‌కు పంపుతుంది (“langhort[.]com”). దీనిద్వారా యూజ్లను గందరగోళానికి గురిచేసేలా కొన్ని Extensions దాదాపు15 రోజుల తర్వాత మాల్‌వేర్ లింక్‌లను పంపుతాయని హెచ్చరించింది. ఇలాంటి Extensions ఇన్ స్టాల్ చేసిన తర్వాత చెక్ చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుత Extensions చెక్ చేసేందుకు ఇన్‌స్టాలేషన్ టైం నుంచి తేదీ > 15 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా ఫిషింగ్ వంటి అనుమానాస్పద లింకులను సైబర్ నేరగాళ్లు యూజర్లకు పంపుతుంటారు. ఆ లింకులతో మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను యూజర్ల నుంచి ఇతర సైట్లకు రీడైరెక్ట్ అయ్యే వీలుంది. తద్వారా మీ పర్సనల్ డేటాతో పాటు బ్యాంక్ వివరాలను యాక్సెస్ చేయవచ్చు.

అలాంటప్పుడు, యూజర్లు ఇలాంటి అనుమానాస్పద ఎక్స్‌టెన్షన్లను డౌన్‌లోడ్ చేయకుండా చూడవచ్చు. ఎల్లప్పుడూ వెబ్ లింక్‌లను చెక్ చేయాలి. URLలో స్పెల్లింగ్ లోపాలు లేదా సంఖ్యలను గుర్తించాలి. Chrome Extensions ఇన్‌స్టాల్ చేసేటప్పుడు యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాంటివి మీ బ్రౌజర్లలో అనుమతించరాదని McAfee కస్టమర్‌లకు సూచిస్తోంది. మీరు Extensions ఇన్‌స్టాల్ చేసే ముందు Chromeలో మీరు కొన్ని పర్మిషన్లను Allow చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి, ఈ డేంజరస్ Extensions గుర్తించగలిగే McAfee WebAdvisorను మీ క్రోమ్ బ్రౌజర్‌లో కంపెనీ యూజర్లకు సూచిస్తోంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now