Free Eeducation Learning Apps: మీరు ఇంట్లో బందీ అయిపోయారా, అయితే మీ కోసమే కొన్ని లెర్నింగ్ యాప్స్, ఉచితంగా క్లాసులు అందిస్తున్న 7 యాప్స్ మీద ఓ లుక్కేయండి
ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. విద్యార్ధులు, ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మనమందరం ఇప్పుడు ఇంటిలో ఉండటం వల్ల కొత్త విషయాలను నేర్చుకోలేకపోతున్నామని చాలా బాధపడుతుంటారు. అయితే ఆ బాధ లేకుండా కొన్ని యాప్ లు ప్రీమియం సభ్యత్వంతో ఉచితంగా వారికి సేవలను అందిస్తుంది. ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఉపయోగపడే యాప్ ల గురించి ఓసారి తెలుసుకుందాం.
Mumbai, April 6: దేశంలో కరోనావైరస్ దెబ్బకు మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. విద్యార్ధులు, ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మనమందరం ఇప్పుడు ఇంటిలో ఉండటం వల్ల కొత్త విషయాలను నేర్చుకోలేకపోతున్నామని చాలా బాధపడుతుంటారు.
జియో 100 నిమిషాల ఉచిత కాల్స్, 100 ఉచిత మెసేజ్‌లు
అయితే ఆ బాధ లేకుండా కొన్ని యాప్ లు ప్రీమియం సభ్యత్వంతో ఉచితంగా వారికి సేవలను అందిస్తుంది. ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఉపయోగపడే యాప్ ల గురించి ఓసారి తెలుసుకుందాం.
BYJU యాప్ : (BYJUs)
లాక్ డౌన్ సమయంలో BYJU యాప్ తన సేవలను ఉచితంగా అందించనుంది. ఈ యాప్ ద్వారా 1నుంచి 7 తరగతుల విద్యార్ధులు విద్యా అభ్యసించటానికి ఉపయోగపడుతుంది. ఈ సేవలను ఏప్రిల్ చివరి వరకు ఎటువంటి ఫీజు లేకుండా అందుబాటులో ఉంటాయి.
ఎయిర్టెల్ ఈబుక్స్ : (Airtel ebooks/Juggernaut)
భారతి ఎయిర్టెల్ నుంచి ఈబుక్స్ రీడింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా కొన్ని ఉచిత పుస్తకాలను అందిస్తుంది. పోషకాహార నిపుణుడైన రుజుతా దివేకర్, నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, అమితాబ్ బాగ్చి, మను పిళ్త్ళె, ట్వింకిల్ ఖన్నా వంటి ఎన్నో మంచి పుస్తకాలను తమ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.
ఇఎస్ఆర్ఐ : (ESRI)
ఇఎస్ఆర్ఐ యాప్ కూడా ఏప్రిల్ నెలలో తన సేవలను ఉచితంగా అందిస్తుంది. దీనిలో ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువత, పెద్దవారికి జియోలొకేషన్లపై మరింత ఈజీగా తెలుసుకునే విధంగా సహాయపడుతుంది. ఈ యాప్ కింద మరో 20 ఇతర సేవలను అందిస్తుంది.
టోప్పర్ :(Toppr)
ఈ యాప్ ద్వారా అన్ని సబ్జక్టుల యాక్సెస్ తో పాటు, ప్రీమియం సభ్యత్వం లేకుండా విద్యార్ధులకు లైవ్ క్లాసులకు హాజరయ్యే అవకాశాన్ని అందిస్తుంది.
వేదాంతు : (Vedantu)
ఈ యాప్ విద్యార్దులకు ఉచితంగా పాఠాలను అందించటం కోసం హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగుళూరు, కేరళ పాఠశాలతో కలిసి పనిచేస్తోంది. అంతేకాకుండా బెంగుళూరుకు చెందిన ఎడ్టెక్ స్టార్టప్ తో కలిసి 6 నుంచి 12 తరగతులు, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠాలను అందిస్తుంది.
లిడో లెర్నింగ్ : ( Lido learning)
లిడో లెర్నింగ్ యాప్ దాని ఉచిత ట్రయల్స్ ని వ్యవధిని గతంలో ఒక వారంగా ఉండేది. కానీ ఇప్పుడు రెండు వారాలకు పెంచింది. ఈ యాప్ గత సంవత్సరం స్థాపించబడింది. దీనిలో 5 నుంచి 9 వ తరగతి విద్యార్ధుల వరకు లైవ్ లో గణితం, సైన్స్ క్లాసులను అందిస్తుంది. దీని కంటెంట్ ఇంగ్లీష్ లో కూడా అందుబాటులో ఉంది.
ఎక్స్ ట్రామార్క్ : (Extramarks)
ఎక్స్ ట్రామార్క్స్ కూడా ఏప్రిల్ 2020 చివరకు తమ వినియోగదారులకు ఉచితంగా సేవలను అందిచటానికి బ్యాండ్ వాగన్ లోకి చేరింది. ఈ యాప్ ద్వారా పోటీ పరీక్షలు జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.