Dark Patterns in Indian Apps: స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే కొన్ని యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI), ParallelHQ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనంలో చేర్చబడిన 53 యాప్‌లలో 52 వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో వినియోగదారులు ఆయా యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
నివేదిక ప్రకారం అధ్యయనంలో చేర్చబడిన 53 యాప్‌లలో 52 గందరగోళ వినియోగదారు ఇంటర్‌ఫేస్, తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని రిపోర్ట్ చెప్పింది. ఈ క్రమంలో Ola, Uber, Swiggy, Zomato, Paytm, PhonePe, Amazon, Myntra, MakeMyTrip వంటి పెద్ద యాప్‌లు కూడా ఈ అధ్యయనంలో చేర్చబడ్డాయి. వినియోగదారులను తప్పుదారి పట్టించే ఈ యాప్‌లను వినియోగదారులు 21 బిలియన్ సార్లు డౌన్‌లోడ్(downloads) చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన
విశ్లేషించబడిన 79% యాప్‌లలో గోప్యతా ఉల్లంఘనలు కనుగొనబడ్డాయి. 43% యాప్‌లలో 45% యూజర్ ఇంటర్‌ఫేస్‌లలో ధరను అమలు చేస్తున్నట్లు గుర్తించారు. 32% యాప్‌లు తప్పుగా ఉన్నాయన్నారు. ఇవి వినియోగదారులు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు. యాప్‌లు వినియోగదారుల స్వయంప్రతిపత్తి, నిర్ణయం తీసుకునే ప్రక్రియ లేదా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయని ASCI నివేదిక పేర్కొంది. ఈ యాప్‌లు మన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని, మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయని సర్వే హెచ్చరించింది.