Airtel: ఎయిర్‌టెల్‌ నుంచి మూడు కొత్త ప్లాన్లు, 350కి పైగా ఛానెళ్లను ఉచితంగా వీక్షించే అవకాశం, కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల వివరాలు ఓ సారి చెక్ చేయండి

ఎయిర్‌టెల్ రూ. 1599, రూ. 1,099, రూ. 699 ల విలువ చేసే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Bharti Airtel. (Photo Credits: Twitter)

ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ మూడు సరికొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ రూ. 1599, రూ. 1,099, రూ. 699 ల విలువ చేసే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్లలో ఎయిర్‌టెల్‌ 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో అపరిమిత డేటా, 350కి పైగా ఛానెళ్లను ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాదు 17 ప్రీమియం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో మూడు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లను సబ్‌స్క్రైప్‌ చేసుకోవాలనే వినియోగదారులు ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను చూడొచ్చు.

ఎయిర్‌టెల్ తాజా రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ఇప్పటికే ఉన్న రూ. 1,498 ప్లాన్‌లాంటిదే. కానీ, 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో 350కి పైగా ఛానెళ్లకు యాక్సెస్‌ లభిస్తుంది. అయితే దీని కోసం రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది.ఇది వన్-టైమ్ ఛార్జ్. ఈ సెటప్ బాక్స్‌తో, వినియోగదారులు కేబుల్ టీవీతో పాటు ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.ఇందులో 300ఎంబీపీఎస్‌, ఇంటర్నెట్ వేగం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి టాప్‌ ఓటీటీలు ఉచితం. అంతేకాదు ఈ ప్లాన్‌లో SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TVలాంటి 17 ఓటీటీలు ఉచితం. నెలకు 3.3టీబీ డేటా వాడుకోవచ్చు.

రూ. 1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఇందులో నెలకు 200ఎంబీపీఎస్‌ వేగంతో 3.3 టీబీ డేటా లభ్యం. ఇందులోనూ అన్ని ఓటీటీలు ఉచితం. ఇక ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆఫర్లో 350కి పైగా ఛానెల్స్‌ కూడా ఉచితం.

రూ. 699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

సరసమైన ఈ ప్లాన్‌లో 40ఎంబీపీఎస్‌ వేగంతో నెలకు 3.3టీబీ డేటా అందిస్తుంది. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మినహా పైన పేర్కొన్న అన్ని ఓటీటీలకు, టీవీ చానెల్స్‌కు యాక్సెస్‌ ఉంటుంది



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Free Aadhaar Update Last Date: ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు మ‌రోసారి గ‌డువు పెంపు, ఉచితంగా ఎలా ఆధార్ అప్ డేట్ చేసుకోవ‌చ్చంటే?

Restrictions On New Year Celebrations: హైదరాబాద్‌ లో న్యూఇయ‌ర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు.. జైలుకు కూడా పంపించొచ్చు.. జాగ్రత్త మరి..!!