Airtel: డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, వింక్ మ్యూజిక్‌ అన్నీ ఉచితంగా పొందడం ఎలా, ఈ ఆఫర్ వినియోగించుకుంటే మీరు అవన్నీ నెల రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు

మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులకు ఎయిర్ టెల్ కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్ (free Disney+ Hotstar Amazon Prime Video Subscription) ప్రకటించింది.

Bharti Airtel. (Photo Credits: Twitter)

దేశంలో ఐపీఎల్ త్వరలో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎయిర్ టెల్ ప్రీఫెయిడ్ కస్టమర్లకు (Airtel prepaid Customers) బంఫరార్ ప్రకటించింది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులకు ఎయిర్ టెల్ కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్ (free Disney+ Hotstar Amazon Prime Video Subscription) ప్రకటించింది. ఐపీఎల్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా బండిల్‌ ప్లాన్‌లను (Airtel prepaid plans) అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లతో పాటు ఉచితంగా ఓటీటీ సేవల్నిఅందిస్తుంది.

కొద్దిరోజుల క్రితం రిలయన్స్‌ జియో ఉచితంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. తాజాగా ఎయిర్‌టెల్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ను వీక్షించవచ్చు. ఇందులో అదనంగా మరో 3రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ను ఉచితంగా చూసే అవకాశం అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రతినిధులు తెలిపారు. దీని ప్రకారం.. ఎయిర్‌టెల్‌ రూ.499ప్లాన్‌ను ఎంచుకున్న యూజర్లకు ప్రతిరోజు 2జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్టీడీ,రోమింగ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.

గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి

అలాగే ఎయిర్‌టెల్‌ రూ.599 ప్లాన్‌‌తో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 3జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ బెన్ఫిట్‌ పొందవచ్చు. ఇక ఎయిర్‌టెల్‌ రూ.839 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్‌, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ బెన్ఫిట్స్‌, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినొచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.2,999 ప్లాన్‌: ఈ ప్లాన్‌లో యూజర్లు 365రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటా , ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ బెన్ఫిట్స్‌ పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.3359ప్లాన్‌: ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 2జీబీ డేటా, దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ బెన్ఫిట్‌ పొందవచ్చు.



సంబంధిత వార్తలు