Airtel Free Data Offer: ఎయిర్‌టెల్ ఉచిత డేటా ఆఫర్, ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటా ఉచితం, ఆఫర్ వివరాలు ఓ సారి తెలుసుకోండి

ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటాను ఉచితంగా (Airtel starts offering 500MB free data) ఇస్తున్నట్టు ప్రకటించింది.

Airtel prepaid users to get Rs 4 lakh life cover under Rs 599 plan (Photo-File image)

ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచి ఖాతాదారులకు షాకిచ్చిన ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా గుడ్‌న్యూస్ (Airtel Free Data Offer) చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటాను ఉచితంగా (Airtel starts offering 500MB free data) ఇస్తున్నట్టు ప్రకటించింది. రూ. 265, రూ. 299, రూ.719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవల ప్రీపెయిడ్ ప్యాక్ ధరలను పెంచిన ఎయిర్‌టెల్ మరింత టాక్‌టైమ్, మరింత డేటా అందిస్తామని అప్పట్లో పేర్కొంది.

ఇటీవల ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ టారిఫ్‌తో పాటు డేటా ధరల్ని పెంచింది. ప్రీపెయిడ్‌ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్‌ అప్‌ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ఈ పెరిగిన కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో ఎయిర్‌ టెల్‌ ప్రీపెయిడ్‌ సెలెక్టెడ్ ప్లాన్స్‌పై ప్రతిరోజూ 500ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌టెల్ తాజాగా ప్రకటించిన ఆఫర్ అన్ని ప్లాన్లకు వర్తించదు.

రూ. 265 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా 28 రోజులపాటు లభిస్తుండగా, రూ. 839 ప్లాన్‌లో 84 రోజుల కాలపరిమితితో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే ప్రతి రోజు అదనంగా 500 ఎంబీ డేటా లభిస్తుంది.

స్మార్ట్‌‌ఫోన్‌కు బానిసై..తల్లిదండ్రులను గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు

అదనపు డేటా ఆఫర్ ప్లాన్ కాలపరిమితి ఉన్నంత వరకే ఉంటుంది. ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ ఆఫర్ కూడా ముగిసిపోతుంది. అదనపు డేటాకు రోల్ ఓవర్ సౌలభ్యం ఉండదని ఎయిర్‌టెల్ తెలిపింది. కాగా, ఈ అదనపు డేటా ఆఫర్ ఎంతకాలం ఉంటుందనే వివరాలను మాత్రం ఎయిర్‌టెల్ వెల్లడించలేదు.

ఎయిర్ టెల్‌ పెంచిన ధరలు

♦ఎయిర్‌ టెల్‌ పెంచిన రూ. 79గా ఉన్న ప్లాన్‌ రేటు రూ. 99కి చేరింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 విలువ చేసే టాక్‌టైమ్‌, 200 ఎంబీ డేటా, సెకనుకు పైసా వాయిస్‌ టారిఫ్‌ ఉంటుంది.

♦ అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ ప్లాన్లలో రూ. 149 ప్లాన్‌ ధర రూ. 179కి పెంచింది. అలాగే రూ. 2,498 ప్లాన్‌ రూ. 2,999గా మారింది. .

♦ డేటా టాప్‌ అప్‌ రూ. 48 ప్లాన్‌ ఇకపై రూ. 58కి (3 జీబీ డేటాతో), రూ. 98 ప్లాన్‌ కొత్తగా రూ. 118కి (12 జీబీ డేటా) మారింది.

♦ రూ. 251 డేటా టాప్‌ అప్‌ ప్లాన్‌ రేటు ఇకపై రూ. 301కి (50 జీబీ డేటా) కి చేరింది.