Lost Your Phone: మీ ఫోన్ పోయిందా.. వెంటనే ఇలా చేయకపోతే ప్రమాదంలో పడిపోతారు, ఫోన్ ఎవరి చేతిలోనైనా పడితే చాలా డేంజర్, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
ప్రతి ఒక్క పని టెక్నాలజీతో ముడిపడటంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ (Android smartphone) అవసరం అయింది. దీంతో చాలామంది తమ పర్సనల్ డేటాను ఫోన్ లోనే స్టోర్ చేస్తుంటారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా అందులోనే ఉంటాయి.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చాలా చవకగా మారడం.. ప్రతి ఒక్క పని టెక్నాలజీతో ముడిపడటంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ (Android smartphone) అవసరం అయింది. దీంతో చాలామంది తమ పర్సనల్ డేటాను ఫోన్ లోనే స్టోర్ చేస్తుంటారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా అందులోనే ఉంటాయి. చాలా సెన్సిటివ్ డేటా ఫోన్ లో ఉంటుంది కాబట్టి.. ఒకవేళ ఫోన్ పోతే.. లేదా ఎవరైనా దొంగలిస్తే (You Lost Your Phone)మన ఫోన్ మనకు తిరిగి వస్తుందా? ఆ ఫోన్ లోని ముఖ్యమైన సమాచారాన్ని ఎవరైనా దొంగలిస్తే.. అప్పుడు ఏం చేయాలి.. అనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి. మీరు మీఫోన్ పోయినట్లైతే (Things To Do Immediately) ఈ విధంగా చేసి చూడండి.
ఫోన్ పోయిన తరువాత మీరు ముందు ఒకసారి మీ ఫోన్ కు ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఎవరూ ఆన్సర్ చేయలేదు అంటే.. ఫోన్ ఎక్కడో మిస్ అయినట్టే.. ఒకవేళ ఎవరైనా ఆన్సర్ చేస్తే.. వాళ్లు చెప్పిన అడ్రస్ కు వెళ్లి ఫోన్ ను తెచ్చుకోవచ్చు. అయితే ఇలాంటి సమయంలో మీరు వెంటనే మీ సిమ్ కార్డు నెట్ వర్క్ ప్రొవైడర్ కస్టమర్ కేర్ కు వేరే ఫోన్ నుంచి కాల్ చేసి వెంటనే ఆ ఫోన్ నుంచి ఔట్ గోయింగ్ కాల్స్ ను బ్లాక్ చేయమని చెప్పాలి.
ఆ తర్వాత టెక్నాలజీ సాయంతో మీ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్లలో ఫైండ్ మై డివైజ్ ఆనే ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ లో ఉండి.. గూగుల్ అకౌంట్ తో లింక్ అయి ఉంటే కనుక.. వెంటనే మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. దాని కోసం.. మీరు వేరే ఫోన్ లో మీ గూగుల్ అకౌంట్ కు లాగిన్ అవ్వాలి. జీ మెయిల్ తో లాగిన్ అయ్యాక.. ఫైండ్ మై డివైజ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే.. మీ ఫోన్ లొకేషన్ ను చూపిస్తుంది.
అయితే.. మీ ఫోన్ లో జీపీఎస్, ఇంటర్నెట్ ఆన్ లో ఉంటేనే కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మాత్రం ఫోన్ ఆన్ లో ఉన్నప్పుడు ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాను మాత్రమే చూపిస్తుంది. అలాగే.. ఫైండ్ మై డివైజ్ అనే ఆప్షన్ ద్వారా.. పోయిన మీ ఫోన్ కు లాక్ కూడా వేసుకోవచ్చు. మెసేజ్ కూడడా పంపించవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫోన్ మాత్రం దొరికే చాన్స్ లేకపోతే.. ఆ ఫోన్ లో ఉన్న డేటాను కూడా తీసేయొచ్చు. అలాగే.. మీ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ను కూడా బ్లాక్ చేయాలి. దాని కోసం www.ceir.gov.in/Home/index.jsp అనే వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి మీ ఫోన్ పోయినట్టుగా ఫిర్యాదు ఇవ్వండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎందుకంటే.. మీ ఫోన్ ను ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించినా కూడా మీరు ప్రమాదంలో పడకుండా మీ ఫిర్యాదు మిమ్మల్ని కాపాడుతుంది.