Autolycos Malware: మీ ఫోన్లో ఈ 8 యాప్స్ ఉన్నాయా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే! యాప్స్‌తో ఫోన్‌లోని డేటా చోరీ చేస్తున్న మాల్‌వేర్, మీకు తెలియకుండానే బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఖాళీ అవ్వడం ఖాయం

ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు (Android Users) జాగ్ర‌త్త !! స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్న జోక‌ర్ (Joker) త‌ర‌హా మ‌రో మాల్‌వేర్‌ను(Malware) సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. గూగుల్ స్టోర్‌లోని (Google store) 8 యాప్స్‌లో ఆటోలికోస్ (Autolycos) అని పిల‌వ‌బ‌డే ఈ డేంజ‌ర‌స్‌ మాల్‌వేర్ ఉంద‌ని వెల్ల‌డించారు.

Mobile Apps. Representational image. (Photo Credit: Pixabay)

New Delhi, July 15: ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు (Android Users) జాగ్ర‌త్త !! స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్న జోక‌ర్ (Joker) త‌ర‌హా మ‌రో మాల్‌వేర్‌ను(Malware) సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. గూగుల్ స్టోర్‌లోని (Google store) 8 యాప్స్‌లో ఆటోలికోస్ (Autolycos) అని పిల‌వ‌బ‌డే ఈ డేంజ‌ర‌స్‌ మాల్‌వేర్ ఉంద‌ని వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన అప్లికేష‌న్స్(Applications) గుర్తించిన వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన గూగుల్‌.. వీటిలో ఆరు యాప్స్‌ను ఇప్ప‌టికే ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. అయితే దీనికోసం ఆరు నెల‌ల స‌మ‌యం పట్టిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా మిగిలిన రెండు యాప్స్‌ను (Apps) కూడా ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. అయితే ఇప్ప‌టికే ఈ యాప్స్‌ను 30 ల‌క్ష‌ల మందికి పైగా యూజ‌ర్లు డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Side Effects of Porn: షాకింగ్ సర్వే.. పోర్న్ చూస్తే అది పనిచేయడంలేదట, ఆ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటుపడుతున్న యూత్, భాగస్వామితో సెక్స్ సమయంలో అంగం స్తంభన సమస్యలు 

మిగిలిన మాల్‌వేర్‌ల‌తో (Malware) పోలిస్తే ఇది కాస్త ప్ర‌మాద‌క‌ర‌మ‌ని సైబ‌ర్ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆటోలికోస్ మాల్‌వేర్ మీ మొబైల్‌లోకి చేర‌గానే.. త‌న ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ముందుగా మీ మెసేజ్‌ల‌ను సీక్రెట్‌గా చ‌దివేస్తుంది. అలాగే మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న ఇత‌ర యాప్స్ నుంచి కూడా మొత్తం డేటాను త‌స్క‌రిస్తుంది. వీటి ద్వారా మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న‌ బ్యాంక్ అకౌంట్స్‌లోని డ‌బ్బుల‌ను ఖాళీ చేస్తుంది. అందుకే ఈ మాల్‌వేర్‌ను గుర్తించిన 8 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంట‌నే అన్ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

Locate Your Nearest Aadhaar Center: మీ దగ్గర్లోని ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడం చిటికలో పని! సరికొత్త పోర్టల్ ప్రారంభించిన కేంద్రం, ఆధార్ సెంటర్ వివరాలకోసం చేయాల్సింది ఇదే!  

ఇవే ఆ ఫోన్ యాప్స్!

› Vlog Star Video Editor

› Creative 3D Launcher

› WOW Beauty Camera

› Gif Emoji Keyboard

› Freeglow Camera

› Coco Camera V1.1

› Funny Camera by Kelly Tech

› Razer Keyboard & Theme by rxcheldiolola

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now