New Delhi, July 15: నగరాల్లో ఆధార్ కేంద్రం (Aadhar center)ఎక్కడుందో తెలుసుకోవడం ఇప్పటివరకూ కష్టమైన పని. ఇకపై ఒక్క క్లిక్‌తో ఆ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ(UIADAI), ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) దేశమంతటా ఆధార్ కేంద్రాల సమాచారం, లొకేషన్ తెలిపే “భువన్ ఆధార్”(Bhuvan Aadhar) పోర్టల్‌ను ప్రారంభించేందుకు సాంకేతిక సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై యూఐడీఏఐ, ఎన్ఆర్ఎస్‌సీ (హైదరాబాద్), ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో యూఐడీఏఐ, ఎన్ఆర్ఎస్‌సీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మీ సమీప ఆధార్ సేవా కేంద్రాన్ని ఎలా తెలుసుకోవాలి?
https://bhuvan.nrsc.gov.in/aadhaar/ని సందర్శించండి.
స్క్రీన్ ఎడమ వైపున నాలుగు డ్రాప్-డౌన్ ఆప్షన్స్ ఉంటాయి.
సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని గుర్తించడానికి ‘సెంటర్స్ నియర్ బై’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ స్థానం లేదా నగరాన్ని నమోదు చేయడం ద్వారా మీ సమీప ఆధార్ కేంద్రాన్ని గుర్తించండి.
‘సెర్చ్ బై ఆధార్ సేవా కేంద్ర’ ఆప్షన్ ద్వారా కూడా సమీప ఆధార్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ సేవా కేంద్రం పేరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
‘సెర్చ్ బై పిన్‌కోడ్’ అనే మూడో ఆప్షన్ ద్వారా కూడా సమీప ఆధార్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చు.
ఇందుకోసం మీ పిన్‌కోడ్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
‘స్టేట్ వైస్ ఆధార్ సేవా కేంద్ర’ అనే నాలుగో ఆప్షన్ ద్వారా మీ జిల్లా లేదా రాష్ట్రంలోని ఆధార్ సేవా కేంద్రాల జాబితా తెలుసుకోవచ్చు.
ఇందుకోసం రాష్ట్రం, జిల్లా, కేంద్రం రకంలాంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.