Instagram

New Delhi, FEB04: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ (Twitter) ట్విట్టర్ పేమెంట్ వెరిఫికేషన్ మార్క్ కోసం యూజర్లకు ఛార్జీలు విధిస్తోంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్విట్టర్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందులో ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ టిక్ కూడా ఛార్జీ విధించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) కూడా అదే దారిలో వెళ్లనుంది. ట్విట్టర్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ కూడా బ్లూ బ్యాడ్జ్‌ (Instagram Blue Badge) ఛార్జీలను విధించాలని భావిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ త్వరలో పేమెంట్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతుందని నివేదిక వెల్లడించింది.  దీనికి సంబంధించి IG_NME_PAID_BLUE_BADGE_IDV, FB_NME_PAID_BLUE_BADGE_IDV వంటి స్ర్కీన్‌షాట్‌లను TechCrunch ద్వారా షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ (Facebook) రెండింటిలోనూ పేమెంట్ వెరిఫికేషన్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోందని పేర్కొంది. IDV అంటే ‘ఐడెంటిఫికేషణ్ వెరిఫికేషన్’ అని నివేదిక చెబుతోంది.

Google Bans 12 Android Apps: ప్లే స్టోర్ నుండి 12 యాప్‌లను తొలగించిన గూగుల్, వెంటనే వాటిని మీ మొబైల్స్ నుండి తీసేయాలని యూజర్లకు హెచ్చరిక  

Twitter ప్రస్తుతం వెరిఫికేషన్ బ్యాడ్జ్, ఇతర బెనిఫిట్స్ కలిగి ఉన్న బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం వెబ్ యూజర్లకు నెలకు 8 డాలర్లు ఛార్జ్ చేస్తోంది. iOS లేదా Android యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించాలి. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూకే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ భారత మార్కెట్లో అదే ఫీచర్‌ను ఇంకా లాంచ్ చేయలేదు. అయినప్పటికీ, ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. iOS యూజర్లు దేశంలో రూ.999 చెల్లించాల్సి రావచ్చు. గత ఏడాది నవంబర్‌లో, బ్లూ సబ్‌స్క్రిప్షన్ భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి రావొచ్చునని ఎలోన్ మస్క్ ధృవీకరించారు. ఇన్‌స్టాగ్రామ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌కి కూడా ఛార్జీ విధిస్తే.. ప్లాట్‌ఫారమ్‌లోని ఎవరైనా ట్విట్టర్ మాదిరిగానే చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్‌ (Facebook)లలో వెరిఫై చేసిన తర్వాత బ్యాడ్జ్‌లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Netflix Update: నెట్‌ఫ్లిక్స్ కొత్త అప్‌డేట్, ఇకపై బయటవారికి మీరు పాస్‌వర్డ్ షేర్ చేయలేరు, నెల రోజులకు ఓ సారి వైఫై కనెక్ట్ కావాల్సిందే..  

ప్రస్తుతానికి, ఈ ఫీచర్‌పై క్లారిటీ లేదు. అంతేకాకుండా, ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల క్యాండిడ్ స్టోరీస్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్లు తమ స్టోరీలో ఏదైనా ఫొటోను క్యాప్చర్ చేయడానికి లేదా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. సొంత క్యాండిడ్ స్టోరీలను షేర్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ BeReal యాప్‌లో ఉన్న కాన్సెప్ట్‌కి కాపీ అయినట్లు చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్‌లతో పిక్చర్-పర్ఫెక్ట్ ఫొటోలు లేదా చిన్న వీడియోలను షేర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్లాట్‌ఫారమ్ మరింత వాస్తవికంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. BeReal యాప్-ప్రేరేపిత ఫీచర్‌ను యాడ్ చేస్తోంది. ఫేస్‌బుక్ స్టోరీస్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు కంపెనీ ధృవీకరించింది.



సంబంధిత వార్తలు

Nagababu vs Allu Arjun's Army: అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి ఎక్స్ డియాక్టివేట్ చేసుకున్న నాగబాబు, ట్విట్టర్‌లో సంచలన ట్వీట్ చేసిన మెగా బ్రదర్

Mother's Day 2024 Wishes In Telugu: మదర్స్ డే సందర్భంగా Images రూపంలో Facebook, WhatsApp Status ద్వారా తెలియజేయండి..

Mothers Day 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు మదర్స్ డే సందర్భంగా Best Wishes, Images, Quotes, SMS, Greetings ద్వారా WhatsApp, Facebook Status రూపంలో శుభాకాంక్షలు తెలపండి..

Navjeet Sandhu Murder Case: ఆస్ట్రేలియాలో భార‌త విద్యార్ధి హ‌త్య కేసులో ఇద్ద‌రు ఇండియ‌న్స్ అరెస్ట్, హ‌ర్యానాకు చెందిన సోద‌రులే హ‌త్య చేశారంటూ అభియోగాలు

Allu Arjun Promises David Warner: డేవిడ్ వార్న‌ర్ కు అల్లు అర్జున్ ప్రామిస్, పుష్ప స్టెప్ నేర్పిస్తానంటూ పోస్ట్, వైర‌ల్ గా మారిన కామెంట్

T20 World Cup 2024 Squads: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ కోసం తమ జట్లను ప్రకటించిన అన్ని దేశాలు, జూన్ 1 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఐసీసీ 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌

Kalki 2898 AD: అమితాబ్ ఇంత యంగ్ గా మారిపోయాడేంటి? క‌ల్కిలో బిగ్ బీ క్యారెక్ట‌ర్ టీజ‌ర్ రిలీజ్, షాక్ అవుతున్న ఫ్యాన్స్

UK: బహిరంగ ప్రదేశంలో బస్సును ఆపి ఓరల్ సెక్స్ చేసిన డ్రైవర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్, దర్యాప్తు ప్రారంభించిన అధికారులు