Flipkart: తెలుగు ప్రజలకు ప్లిప్‌కార్ట్‌ శుభవార్త, ఇకపై మీరు తెలుగు భాషలో కూడా షాపింగ్ చేయవచ్చు, కొత్త ఫీచర్‌ని యాడ్ చేసిన ప్లిప్‌కార్ట్‌

ఇక మీదట (తెలుగు, తమిళ, కన్నడ భాషల)కు చెందిన వినియోగదారులు తమ ప్రాంతీయ భాషలలో (Flipkart Rolls Out Language Interfaces) షాపింగ్‌ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్‌ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది.

Flipkart Mobile Bonanza Sale has some great offers lined up (Photo Credit: Official) (Representational Image)

Bengaluru, June 24: ఈ- కామర్స్‌ లో దూసుకుపోతున్న దిగ్గజం ప్లిప్‌కార్ట్‌ (Flipkart) తాజాగా తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు ప్లిప్‌కార్ట్‌ శుభవార్త తెలిపింది. ఇక మీదట (తెలుగు, తమిళ, కన్నడ భాషల)కు చెందిన వినియోగదారులు తమ ప్రాంతీయ భాషలలో (Flipkart Rolls Out Language Interfaces) షాపింగ్‌ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్‌ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది. రూ.5 వేలు కన్నా ఎక్కువ డ్రా చేస్తే ఛార్జీల మోత తప్పదా? పలు రకాల ఛార్జీలు పెంచుతూ నివేదికను తయారుచేసిన ఆర్బీఐ కమిటీ, నిశితంగా పరిశీలిస్తున్న అత్యున్నత అధికారులు

అయితే దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలలో సేవలను ( Flipkart New Features) విస్తరించడం వల్ల వినియోగదారులకు సంస్థ మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. కాగా 54 ప్రాంతీయ భాషల పదాలను (తెలుగు, తమిళ, కన్నడ భాషలలో) బ్యానర్‌ పేజీలతో కలిపి వినియోగదారులకు అందించినట్లు ప్లిప్‌కార్ట్‌ పేర్కొంది.

గత సెప్టెంబర్‌లో హిందీ భాషలో వినియోగదారులకు సేవలను అందించామని ఫ్లిప్‌కార్ట్‌ ఈ సంధర్భంగా గుర్తుచేసింది. హిందీ భాషలలో సేవలందించడం ద్వారా వినియోగదారులు సంతృప్తికరంగా ఉన్నారని, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో భారీగా పెరుగుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని.. వారికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ భాషలలో సేవలందించనున్నట్లు తెలిపింది. ప్రాంతీయ భాషలలో సేవలందించే ప్రణాళికలో భాగంగా విశాఖపట్నం, మైసూర్‌లలో భాషలకు సంబంధించిన పదాలను అధ్యయనం చేశామని తెలిపింది. తాజా సేవలతో దేశవ్యాప్తంగా వినియోగదారులను ఫ్లిప్‌కార్ట్‌ ఆకట్టుకుంటుందని పేర్కొంది



సంబంధిత వార్తలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌

Rozgar Mela: రోజ్‌గార్ మేళా, 71 వేల మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ, ఏడాదిన్న‌ర‌లో 10 ల‌క్ష‌ల ప‌ర్మ‌నెంట్ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి