GitHub Layoffs: ఆగని టెక్ లేఆఫ్స్, భారత్‌లోని ఇంజనీర్ల మొత్తాన్ని తీసేస్తున్న గిట్ హబ్, ఫిబ్రవరిలోనే తీసుకున్నామని వెల్లడి

భారత్ లోని తమ ఇంజినీరింగ్ విభాగం మొత్తాన్ని తొలగించాలని గిట్ హబ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గిట్ హబ్ కు అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద డెవలపర్ సెంటర్ భారత్ లోనే ఉంది.

Layoffs Representative Image (Photo Credit: Pixabay)

వెబ్, యాప్ టెక్నాలజీలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ గిట్ హబ్ ఉద్యోగాల కోతకు రెడీ అయింది. భారత్ లోని తమ ఇంజినీరింగ్ విభాగం మొత్తాన్ని తొలగించాలని గిట్ హబ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గిట్ హబ్ కు అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద డెవలపర్ సెంటర్ భారత్ లోనే ఉంది. ఓపెన్ సోర్స్ డెవలపర్ వేదిక గిట్ హబ్ లో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది సభ్యులు ఉంటే, ఒక్క భారత్ లోనే కోటి మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారు.

ఆగని లేఆఫ్స్, అదనపు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సేల్స్‌ఫోర్స్, ఇప్పటికే 8 వేల మందికి ఉద్వాసన పలికిన దిగ్గజం

ప్రముఖ టెక్ రచయిత జెర్గెలీ ఓరోస్జ్ కూడా గిట్ హబ్ ఇంజినీరింగ్ టీమ్ ను తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలను నిర్ధారించారు. గిట్ హబ్ ఇండియన్ ఇంజినీరింగ్ టీమ్ ఇక లేనట్టేనని ట్వీట్ చేశారు. ఉద్యోగుల తొలగింపుపై గిట్ హబ్ కూడా స్పష్టత నిచ్చింది. సంస్థను పునర్ వ్యవస్థీకృతం చేసే చర్యల్లో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు గిట్ హబ్ ప్రతినిధి వెల్లడించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరిలోనే తీసుకున్నామని, ఇప్పుడు అమలు చేస్తున్నామని తెలిపారు. స్వల్పకాలిక ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక వ్యాపార వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని వివరించారు.