Google Find My Device Update: ఫైండ్ మై డివైజ్‌ను అప్‌గ్రేడ్ చేసిన గూగుల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్ కనిపెట్టేయవచ్చు ఇక
యాపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్ తరహాలో ఫైండ్ మై ఫోన్ ఆప్షన్‌ను గూగుల్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
గూగుల్ తన Find My Device సదుపాయాన్ని అప్‌గ్రేడ్ చేసింది.కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఫైండ్ మై డివైజ్ ఆప్షన్‌లో ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్‌ను కనిపెట్టొచ్చు. యాపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్ తరహాలో ఫైండ్ మై ఫోన్ ఆప్షన్‌ను గూగుల్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లందరూ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని తన బ్లాగ్‌లో పేర్కొంది. ఇకపై ఐఫోన్‌లానే ఆండ్రాయిడ్ మొబైల్ ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేయవచ్చు. వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్, యూజర్ల స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో పంపించే ఫీచర్ త్వరలో అందుబాటులోకి
అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేదా, ఆ తర్వాత వెర్షన్ ఫోన్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గూగుల్‌కు చెందిన పిక్సెల్ 8, 8 ప్రో ఫోన్లలో ఈ సదుపాయం మరింత మెరుగ్గా పనిచేస్తుంది. పిక్సెల్ ఫోన్ ఆఫ్‌లో ఉన్నా, బ్యాటరీ పూర్తిగా అయిపోయినా సరే ఈ ఫోన్లలో ఉండే హార్డ్‌వేర్ సాయంతో సులువుగా కనిపెట్టొచ్చని గూగుల్ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ బడ్స్‌ను కూడా ఆఫ్‌లైన్‌లో ఉంటే కనిపెట్టవచ్చని గూగుల్ తెలిపింది.