ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ అందించేందుకు సన్నద్ధమవుతోంది. తన కాంటాక్ట్స్‌లోని సభ్యులతో మరింతగా ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుగా వాట్సప్ స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో పంపించే వెసులుబాటును తీసుకురానుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే కాంటాక్ట్స్‌లోని సభ్యులు అందరి నుంచి స్టేటస్ నోటిఫికేషన్లు పొందవచ్చు. కాంటాక్ట్స్‌లో చూడని స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో అలెర్ట్ పొందొచ్చు. భారత్ రోడ్ల మీద రయ్ మంటూ చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్ కారు, వీడియో ఇదిగో..
కొత్తగా తీసుకురానున్న ఫీచర్లలో స్టేటస్ అప్‌డేట్ ఉండనుందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాంటాక్ట్స్‌లో తమకు నచ్చినవారితో చాటింగ్ కోసం కూడా నోటిఫికేషన్లు పంపించే ఫీచర్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వాట్సప్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో పాటుగా ‘సజెస్టెడ్ చాట్’ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి రానుందని టెక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.ఈ ఫీచర్ చాట్ లిస్టులో దిగువన ఉండనుందని తెలుస్తోంది.