స్వయాత్ రోబోట్ వ్యవస్థాపకుడు & CEO అయిన సంజీవ్ శర్మ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించారు. ఆ సంస్థ గత కొన్నేళ్లుగా ఓ ప్రముఖ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ డీజిల్ కారుపై అనేక పరిశోధనలు చేస్తూ వస్తున్న సంగతి విదితమే. ఆటోమొబైల్ రంగంలో ఏఐ టెక్నాలజీ సాయంతో డ్రైవర్‌లెస్ కారును అందుబాటులోకి తెచ్చింది ఈ కంపెనీ. కియా సెల్టోస్ కారుకు సరికొత్త అప్డేట్.. సెల్టోస్ HTK+ ఆటోమేటిక్ వేరియంట్‌లను విడుదల చేసిన కంపెనీ, భారత మార్కెట్లో ఈ కొత్త వేరియంట్ ధర ఎంత, ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకోండి!
ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని జోడించి డీజిల్ వేరియంట్ కారును అటానమస్ డ్రైవర్ లెస్ కారుగా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌లోని కంకాళి కాళీ మాత దేవాలయం నుంచి ఇరుకు సందుల్లో, రోడ్లమీద ట్రాఫిక్‌ను క్లియర్ చేసుకుంటూ డ్రైవర్ లెస్ కారు ప్రయాణాన్ని జీపీఎస్‌తో నావిగేట్ చేస్తున్న వీడియోని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొట్టకుండా పక్కకి వెళ్లడం, జనావాసాల్లో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ముందుకు కారు ప్రయాణించడం మనం గమనించవచ్చు.
Here's Video
Autonomous driving through tight, dynamic, stochastic, and adversarial traffic-dynamics on sub-urban roads in India, as well as through partially unstructured environments.
This demos showcases the robustness of our motion planning and decision making algorithmic frameworks in… pic.twitter.com/UcY07arxSK
— Sanjeev Sharma (@sanjeevs_iitr) February 29, 2024
సింగిల్-లేన్ రోడ్లపై ద్వి దిశాత్మక ట్రాఫిక్‌ను నావిగేట్ చేయడం మరియు టోల్-ప్లాజా నావిగేషన్‌తో సహా స్వయాత్ యొక్క మునుపటి విజయాల్లో కొన్నింటిని కూడా ఈ డెమో సూచిస్తుంది.