2024 Kia Seltos HTK+: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీదారు కియా ఆటోమొబైల్స్ భారతదేశంలో తమ కియా సెల్టోస్ కారును అప్డేట్ చేసింది. కియా సెల్టోస్ కారుకు ఇప్పుడు రెండు కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. ఈ SUV ఇప్పుడు HTK+ పెట్రోల్ CVT మరియు HTK+ డీజిల్ AT అనే వెర్షన్ లలో అందుబాటులో ఉండనుంది. ఎక్స్-షోరూమ్ వద్ద కొత్త సెల్టోస్ హెచ్‌టికె+ పెట్రోల్-సివిటి ధర రూ. 15.40 లక్షలు కాగా, సెల్టోస్ హెచ్‌టికె+ డీజిల్-ఎటి ధర రూ. 16.90 లక్షలుగా నిర్ణయించారు.
సరికొత్త కియా సెల్టోస్ HTK ప్లస్ కార్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో పాటు, కొన్ని అదనపు ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగా పనోరమిక్ సన్‌రూఫ్, డ్రైవ్ మోడ్‌లు, ట్రాక్షన్ మోడ్‌లు, ప్యాడిల్ షిఫ్టర్‌లు, LED టెయిల్ ల్యాంప్స్, LED ఫ్రంట్ మ్యాప్ ల్యాంప్స్ ఇంటీరియర్ LED రీడింగ్ ల్యాంప్స్, లెథెరెట్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్‌లను కొత్తగా ఇస్తున్నారు. అదనంగా HTK ట్రిమ్ ఇప్పుడు LED DRLలు, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ మొదలైన ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి.
అంతేకాకుండా కియా సెల్టోస్ ఆటోమేటిక్ కారుతో 'అరోరా బ్లాక్ పెర్ల్' అనే మరొక కొత్త కలర్ స్కీంను చేర్చారు. మొత్తంగా కియా సెల్టోస్ కారు ఇప్పుడు అరోరా బ్లాక్ పెర్ల్, గ్రావిటీ గ్రే, ఇంటెన్స్ రెడ్, ప్యూటర్ ఆలివ్ మరియు ఇంపీరియల్ బ్లూ అనబడే ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ లలో లభ్యం అవుతుంది.
Kia Seltos- ఇంజన్ సామర్థ్యం
కియా సెల్టోస్ మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ 115 hp శక్తిని, 144 nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 160 hp శక్తిని, 253nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 116 hp శక్తిని, 250 nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
కియా సెల్టోస్ SUV భారతీయ రహదారులపై హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, VW టైగన్, హోండా ఎలివేట్, టయోటా హైరడర్ వంటి కార్లతో పోటీపడుతుంది.