Google: జీమెయిల్ వినియోగదారులకు హెచ్చరిక, రెండు సంవత్సరాలు మీ అకౌంట్ ఉపయోగించకుంటే ఖాతాను డిలీట్ చేయనున్న గూగుల్

ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే (inactive accounts) మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్‌ (Google) తొలగించనుంది.

Google. Office (Photo Credits: IANS)

గూగుల్ జీమెయిల్ వాడేవారికి షాక్ లాంటి వార్త చెప్పింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే (inactive accounts) మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్‌ (Google) తొలగించనుంది. అదేవిధంగా మీ స్టోరేజీ పరిమితి రెండేళ్లు దాటినట్లయితే జీమెయిల్‌, డ్రైవ్‌, ఫోటోల్లో కంటెంట్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఏదైనా కంటెంట్‌ తొలగించడానికి ముందు యూజర్లకు చాలా సార్లు సమాచారం ఇస్తామని పేర్కొంది.

యూజర్లకు గూగుల్ సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి గూగుల్ డేటాను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో కంటెంట్ మొత్తం డిలీట్ (Google may delete content of inactive accounts ) అవుతుంది. మీ ఖాతాను చురుగ్గా ఉంచడానికి మీరు ఎప్పటికప్పుడు జీమెయిల్‌, డ్రైవ్‌‌, ఫొటోలను చూస్తూ ఉండాలని సూచించింది. సైన్‌ ఇన్‌ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్‌ కనెక్ట్‌ చేశారని గూగుల్‌ ఒక రికార్డు చేసుకుంటుందని తెలిపింది. ఇనాక్టివ్‌ అకౌంట్‌ మేనేజర్‌ నిర్ధిష్ట కంటెంట్‌ను నిర్వహించడానికి మీకు సహయ పడుతుందని పేర్కొంది.

ముఖేష్ అంబానీ కంపెనీ భారీ పెట్టుబడులు, బ్రేక్‌త్రూ ఎనర్జీలో రిలయన్స్ రూ.373 కోట్ల పెట్టుబడి, Urban Ladderలో రూ. 182.12 విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు

కాగా వినియోగదారుల సౌలభ్యం కోసం వారి ఖాతాలో జీ మెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌లోని క్రియా రహితంగా, పరిమితికి మించి ఉన్న వాటి కోసం టెక్‌ దిగ్గజం గూగూల్‌ కొత్త పాలసీ తీసుకురానుంది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి అమల్లోకి రానున్న గూగుల్‌ కొత్త పాలసీతో డాక్స్‌, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్‌లు, జూమ్‌బోర్డు ఫైల్స్‌, ఫొటో పరిశ్రమలకు సేవలు ఇక నుంచి సాధారణ పద్ధతులతో మరింత మెరుగ్గా ఉంటాయని గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.