CIBIL Score Check on Paytm App: ఇప్పుడు మీ CIBIL స్కోరు నిమిషంలో తెలుసుకోవచ్చు, పేటీఎం నుంచి కొత్త ఫీచర్, క్రెడిట్‌స్కోర్‌ను పేటియం నుంచి తెలుసుకోవడం ఎలాగో పూర్తి సమాచారం మీకోసం

అంతేకాకుండా యూజర్లు తమ క్రెడిట్ రేటింగ్‌లను నగరం,రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇతరులతో పోల్చకోవచ్చును.

Paytm announces India’s next-generation credit cards to democratise its access (Photo-Twitter)

ఇప్పుడు ఏదైనా బ్యాంకు నుంచి రుణం పొందాలంటే ముందుగా క్రెడిట్‌స్కోర్‌ ఎంత ఉందని బ్యాంక్ అధికారులు కచ్చితంగా అడుగుతారు. మీ క్రెడిట్‌స్కోర్‌ బాగుంటేనే బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడానికి అర్హులమవుతారు. ఈ క్రెడిట్‌స్కోర్‌ను కొన్ని వాణిజ్య వెబ్‌సైట్లు కొంత రుసమును తీసుకొని తెలుపుతాయి. అయితే ఎలాంటి సర్వీస్‌ ఛార్జీలు లేకుండా పేటియం తన యూజర్ల కోసం క్రెడిట్‌స్కోర్‌ను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

పేటియం తెచ్చిన సదుపాయంతో క్రియాశీల క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలను కూడా చూడవచ్చును. అంతేకాకుండా యూజర్లు తమ క్రెడిట్ రేటింగ్‌లను నగరం,రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇతరులతో పోల్చకోవచ్చును. దాంతో పాటుగా వినియోగదారుల సిబిల్ స్కోర్‌ను ఎలా (how you can check your Credit Score) మెరుగుపరచాలి, క్రెడిట్ రిపోర్ట్‌ను ఏవిధంగా అర్థం చేసుకోవాలి, రుణం పొందటానికి మంచి సిబిల్ స్కోరు కలిగి ఉండటం వంటి విషయాలను కూడా పేటియం అందిస్తోంది.

ట్విట్టర్‌పై భారత్‌లో కేసు నమోదు, ఇప్పటికే చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను ఎత్తివేసిన కేంద్రం, ట్విటర్‌ కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ

అధిక క్రెడిట్‌స్కోర్‌ ఉండటంతో (CIBIL Score Check on Paytm App) మీరు సులువుగా రుణాన్ని పొందవచ్చును.పేటియంతో వినియోగదారుల తమ క్రెడిట్‌స్కోర్‌ను కేవలం నిమిషం లోపు అందిస్తోంది.

క్రెడిట్‌స్కోర్‌ను పేటియం నుంచి తెలుసుకోవడం ఎలాగో చూద్దామా..

1. ముందుగా మీ పేటియం యాప్‌ను ఓపెన్‌ చేసి లాగిన్‌ అవ్వండి.

2. తరువాత హోమ్‌ స్క్రీన్‌లో కొద్దిగా పైకి స్క్రోల్‌ చేయండి.

3. లోన్స్‌ అండ్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ విభాగంలో ఉన్న ఫ్రీ క్రెడిట్‌ స్కోర్‌ పై క్లిక్‌ చేయండి.

4. అక్కడ మీకు మీ సమాచారం ఉన్న విండో ఓపెన్‌ అవుతుంది. అందులో మీ పాన్‌కార్డ్‌ నంబర్‌, పుట్టినతేదీని ఎంటర్‌ చేయండి.

5. మీరు మొదటిసారిగా చెక్‌ చేసుకుంటున్నట్లు ఉంటే మీ ప్రొఫైల్‌ ధృవీకరణ కోసం ఓటిపీ వస్తోంది.

6. ఓటీపీను ఎంటర్‌ చేసిన కొద్ది నిమిషాలకే మీకు మీ క్రెడిట్‌ స్కోర్‌ మీ కళ్ల ముందు కనిపిస్తోంది.

7. అంతేకాకుండా మీరు ఇంకా డిటైల్‌గా రిపోర్ట్‌ను తెలుసుకోవాలంటే వ్యూ డిటేల్ఢ్‌ రిపోర్ట్‌ మీద క్లిక్‌ మీకు పూర్తి సమాచారం వస్తోంది.

8. క్లిక్‌ చేసిన వెంటనే మీకు మీరు జాతీయ, రాష్ట్ర, జిల్లా వారిగా మీ క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కడ ఉందో చూపిస్తోంది. వాటితో పాటుగా ఫ్యాక్టర్స్‌ ఇంపాక్టింగ్‌ యువర్‌ క్రెడిట్‌ స్కోర్‌ను కూడా చూపిస్తోంది.

ఫ్యాక్టర్స్‌ ఇంపాక్టింగ్‌ యువర్‌ క్రెడిట్‌ స్కోర్‌:

1. క్రెడిట్ కార్డ్ వినియోగం

2. చెల్లింపుల హిస్టరీ

3. ఎజ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌

4. మీకు ఉన్న మొత్తం అకౌంట్లను చూపిస్తుంది.

5. క్రెడిట్‌ ఎంక్వైరీలో మీరు ఎన్ని సార్లు ఎంక్వైరీ చేశారనే విషయాన్ని తెలుపుతుంది.