India Bans 47 Chinese Apps: పబ్‌జీ ఇండియా నుంచి త్వరలో అవుట్, చైనా కంపెనీలకు మరో షాకిచ్చిన కేంద్రం, 59కు తోడుగా మరో 47 యాప్స్ బ్యాన్, 275 యాప్‌లపై నిషేధం దిశగా అడుగులు
ఈ యాప్‌లకు అనుసంధానంగా ఉన్న మరో 47 చైనా యాప్స్‌ను బ్యాన్ (India Bans 47 Chinese Apps) చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బ్యాన్ చేసిన వాటిలో టిక్‌టాక్ లైట్, హెలో లైట్, షేర్‌ఇట్ లైట్, బిగో లైవ్ లైట్, వీఎఫ్‌ఐ లైట్ (Helo Lite, ShareIt Lite, TikTok, Tiktok Lite, UC Browser) ఉన్నాయి.
New Delhi, July 27: జాతీయ భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా ఉందన్న కారణంతో 59 చైనా యాప్‌లను బ్యాన్ చేసిన కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌లకు అనుసంధానంగా ఉన్న మరో 47 చైనా యాప్స్‌ను బ్యాన్ (India Bans 47 Chinese Apps) చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బ్యాన్ చేసిన వాటిలో టిక్‌టాక్ లైట్, హెలో లైట్, షేర్‌ఇట్ లైట్, బిగో లైవ్ లైట్, వీఎఫ్‌ఐ లైట్ (Helo Lite, ShareIt Lite, TikTok, Tiktok Lite, UC Browser) ఉన్నాయి. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం, టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం
కాగా టిక్‌టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీపై ( PUBG) భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటు అలీ ఎక్స్‌ప్రెస్, లూడో సహా చైనాకు చెందిన 275 యాప్‌లపై భారత్ నిషేదం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాల్వన్ లోయల్ భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు (India-China Borders Tensions) నెలకొన్నప్పటి నుంచి చైనాకు చెందిన యాప్‌లపై (China Apps) ప్రత్యేక దృష్టి సారించిన నిఘా వర్గాలు వరుసగా నిషేధం విధించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్‌లను నిషేదించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ భద్రతకు ముప్పు కలిగేంచాలా మరో 275 చైనా యాప్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్, చైనీస్ యాప్స్ బ్యాన్‌ను డిజిటల్ స్ట్రైక్‌గా అభివర్ణించిన కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరణకు గురవుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. ఈ యాప్ బ్యాన్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. కాగా చైనాకు చెందిన అన్నిటెక్ కంపెనీలు ప్రభుత్వం ఏ సమాచారాన్ని కోరినా ఇవ్వాల్సిందిగా 2017 నాటి చట్టంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్, సహా వివిధ దేశ వినియోగదారుల డేటాపై చైనా నియంత్రణ ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.