Aadhaar Data Leak: 81 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్, రూ. 65 లక్షలకు డార్క్ వెబ్‌లో బేరానికి పెట్టిన హ్యాకర్, అప్రమత్తమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్

విలువైన సమాచారాన్ని దొంగిలించి అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు.

Aadhaar data Leak (Photo-X and Pixabay)

81.5 Crore Indians’ Personal Data Leaked: ప్రపంచవ్యాప్తంగా హ్యకర్లు రెచ్చిపోతున్నారు. విలువైన సమాచారాన్ని దొంగిలించి అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. బిజినెస్ స్టాండర్డ్ నివేదించిన ప్రకారం 81.5 కోట్ల మంది భారతీయులు అంటే దాదాపు 81.5 మిలియన్ల మంది వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం డార్క్ వెబ్‌లో లీక్ అయిందని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రిసెక్యూరిటీ నివేదిక పేర్కొంది .

నివేదిక ప్రకారం, పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారంతో సహా డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంది.అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్‌పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది.ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు (రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది.

డేటా ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు జూన్‌లో, CoWin వెబ్‌సైట్ నుండి VVIP లతో సహా టీకాలు వేసిన పౌరుల వ్యక్తిగత డేటా టెలిగ్రామ్ మెసెంజర్ ఛానెల్ ద్వారా లీక్ అయినందున ప్రభుత్వం డేటా ఉల్లంఘనపై దర్యాప్తు ప్రారంభించింది .అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు.

ముఖేష్ అంబానీకి మూడో బెదిరింపు మెయిల్, ఈ సారి ఏకంగా రూ. 400 కోట్లు డిమాండ్ చేసిన అగంతకులు

గత ఎనిమిది నెలల్లో సుమారు ఆరువేల సార్లు ఐసీఎంఆర్‌ సర్వర్లపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. దీనిపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర సంస్థలు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని, అక్కడి నుంచే డాటా చోరీ జరిగిందని అనధికార వర్గాలు పేర్కొన్నాయి. డాటా చోరీ విషయం తెలిసిన వెంటనే వివిధ ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. డాటా చోరీలో విదేశీ వ్యక్తుల హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మరింత నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు.

కొవిడ్‌ పరీక్షలు జరిపిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయా వైద్య సంస్థలు సేకరించిన పౌరుల వివరాలు ఐసీఎంఆర్‌కు, జాతీయ సమాచార కేంద్రానికి (ఎన్‌ఐసీ), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందించారు. ఈ మూడు ప్రదేశాలలో ఎక్కడి నుంచి డాటా చోరీ అయిందో తెలియాల్సి ఉన్నదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ముఖేష్ అంబానీ ఇంటివద్ద కలకలం, కీలక మలుపు తిరిగిన కేసు, మన్సుఖ్ హిరెన్ అనుమానాస్పద మరణంపై మహారాష్ట్ర ఏటీఎస్ ఎఫ్ఐఆర్ నమోదు, ఎన్‌ఐఏ దర్యాప్తును డిమాండ్‌ చేస్తున్న ఫడ్నవిస్

భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్‌ దోపిడీలు, ట్యాక్స్‌ రిఫండ్‌ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఆధార్‌ వివరాలు అంత సురక్షితంగా లేవని, ఆ సమాచారాన్ని ఎవరైనా దొంగిలించవచ్చని బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌, క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ గత నెలలోనే హెచ్చరించాయి. అయితే హెచ్చరికలను కేంద్ర సంస్థలు వెంటనే తోసిపుచ్చాయి.దేశంలో బ్యాంక్‌ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తిఆధార్‌ను దానికి అనుసంధానం చేశారు.

పట్టణాలు, నగరాల్లోనే కాదు గ్రామీణులు సైతం ఎలక్ట్రానిక్స్‌ విధానంలో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల వివరాలకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. ఇప్పటికి 94.5 కోట్ల మంది అనగా 60 శాతం మంది ఓటర్లు తమ ఓటర్‌ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేశారు. సైబర్‌ దొంగల వద్దనున్న భారతీయుల డాటాతో ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్‌ దోపిడీలు, ట్యాక్స్‌ రిఫండ్‌ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.