Itel P55T: ఐఫోన్ లాంటి డిజైన్‌తో సరికొత్త ఐటెల్ అండ్రాయిడ్ ఫోన్ ఇదిగో.. ఐటెల్ పి55టి స్మార్ట్‌ఫోన్ లాంచ్, దీని ధర తక్కువ కానీ ఫీచర్లు చాలా ఎక్కువ, పూర్తి వివరాలు తెలుసుకోండి!
Itel P55T Smartphone: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐటెల్, తాజాగా తమ బ్రాండ్ నుంచి P55T అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఇది సరసమైన ధరలోనే లభించే ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్. అయినప్పటికీ, ఐటెల్ P55Tలో 6,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 45 రోజుల స్టాండ్‌బై సమయాన్ని మరియు 155 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ సరికొత్త ఐటెల్ స్మార్ట్‌ఫోన్, ఐఫోన్ లాగా కనిపించే డిజైన్‌ను కలిగి ఉంది, ఐఫోన్ లాంటి డైనమిక్ బార్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. నోటిఫికేషన్‌లను త్వరగా వీక్షించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఏకైక 4GB+128GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది, అయితే మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో ఆన్‌బోర్డ్ ర్యామ్‌ను వర్చువల్‌గా 8GB వరకు విస్తరించవచ్చు. అలాగే ఇది ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ గోల్డ్ అనే రెండు మిరుమిట్లుగొలిపే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
Itel P55Tస్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Itel P55T స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.56-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- 4GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+ AI డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జింగ్
కనెక్టివిటీ కోసం డ్యూయల్ నానో SIM, Wi-Fi, బ్లూటూత్, GPS, 4G, OTG మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో ఇ-కంపాస్, జి-సెన్సార్, గైరోస్కోప్ ఉన్నాయి.
ధర: రూ. 8,199/-
itel P55T స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. వివిధ బ్యాంక్ కస్టమర్లు రూ. 1,500 వరకు అదనపు తగ్గింపును సైతం పొందవచ్చు.