iQOO Z9 5G: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.. రూ. 18 వేల బడ్జెట్ ధరలో ప్రీమియం రేంజ్ ఫీచర్లను అందిస్తోన్న ఐకూ.. భారత మార్కెట్లో మరొక సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!
iQOO Z9 5G: ఐకూ కంపెనీ భారత మార్కెట్లో iQOO Z9 5G అనే మరొక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లోని మిగతా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఇది మీడియాటెక్ చిప్‌సెట్‌ను కలిగిన శక్తివంతమైన హ్యాండ్ సెట్. ఇందులో స్పష్టమైన వీక్షణను అందించే AMOLED డిస్‌ప్లేతో పాటు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. వెనకవైపు 50 మెగాపిక్సెల్ కలిగిన సోనీ IMX 882 OIS కెమెరా ఉంది.
స్మార్ట్‌ఫోన్ డస్ట్ ప్రూఫ్, స్ల్పాష్-రెసిస్టెంట్ కోసం IP54 రేటింగ్స్ కలిగి ఉంది. అంటే ఇది తేలికపాటి నీటి చుక్కలను, వర్షపు చినుకులను, తేలికపాటి దుమ్మురేణువులను తట్టుకోగలదు. ఇటువంటి ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు రూ. 18 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి ధరల శ్రేణిలో ఈ రకమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటివరకూ ఇదే మొదటిది అని చెప్పవచ్చు.
iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా బ్రష్డ్ గ్రీన్, గ్రాఫేన్ బ్లూ కలర్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. అదనంగా iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే
- 8GBRAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 44W ఫాస్ట్ ఛార్జింగ్
ధరలు:
8GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 17,999/-
8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 21,999/-
అయితే, ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 2,000 తక్షణ తగ్గింపు లభిస్తోంది, ఈ ప్రకారంగా iQOO Z9 5G ధరలు వరుసగా రూ. 17,999 మరియు రూ. 19,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 13 నుండి అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.