JioBook laptop: వామ్మో ఇంత తక్కువ ధరకే ల్యాప్ ట్యాప్ ఎప్పుడూ చూసి ఉండరు! రూ. 15వేల లోపు ల్యాప్ టాప్, అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన జియో, ఇంతకీ ల్యాప్ టాప్ ఎక్కడ కొనొచ్చు! వివరాలు తెలుసుకోండి
ల్యాప్‌టాప్ JioOSలో రన్ అవుతుంది. సున్నితమైన పర్ఫార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. ప్రొడక్టుల్లో JioStore కూడా ఉంది. ల్యాప్‌టాప్‌లో ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
Mumbai, OCT 21: జియోబుక్ ల్యాప్‌టాప్ ప్రస్తుతం భారత్‌లో ప్రతిఒక్కరికీ రూ 15,000 లోపు అందుబాటులోకి వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్‌లను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లకు జియోబుక్ ల్యాప్‌టాప్ సరైన ఎంపికని టెక్ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో ఇటీవల ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఈఎంసీ) ఈవెంట్ వేదికగా ఈ ల్యాప్‌టాప్‌ను లాంఛ్ చేయగా తొలుత ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండగా తాజాగా వినియోగదారులందరికీ లభిస్తోంది. జియోబుక్ ల్యాప్‌టాప్ ఖరీదు రూ 15,799 ప్రారంభ ధర కాగా, కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు. పలు బ్యాంకు కార్డులపై రూ 5000 వరకూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుండగా, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ 5000 తగ్గింపు లభిస్తోంది. జియోబుక్ 11.6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు ముందుభాగంలో వీడియో కాల్స్ కోసం 2 ఎంపీ కెమెరా కలిగిఉంది. తక్కువ బడ్జెట్‌లో బ్రౌజింగ్‌తో పాటు ఎడ్యుకేషన్ అవసరాల కోసం ఈ ల్యాప్‌టాప్ మెరుగ్గా ఉపయోగపడుతుంది.
ఈ ల్యాప్‌టాప్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 665 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌ను కలిగిఉంది. జియోల్యాప్ టాప్ 11.6-అంగుళాల HD డిస్ప్లేతో వస్తుంది. వీడియో కాల్‌ల కోసం.. బ్రాడ్ బెజెల్స్, ముందు భాగంలో 2-MP కెమెరాను కలిగి ఉంది. Qualcomm Snapdragon 665 SoC ద్వారా ప్రాసెసర్ ఉంది. దీనికి Adreno 610 GPU సపోర్టు అందిస్తుంది. కేవలం 2GB RAMతో వస్తుంది. అయితే మల్టీ టాస్కింగ్ దీనిపై సాఫీగా ఉండదు. 128GB వరకు అప్ గ్రేడ్ చేసుకునే 32GB eMMC స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది.
ల్యాప్‌టాప్ JioOSలో రన్ అవుతుంది. సున్నితమైన పర్ఫార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. ప్రొడక్టుల్లో JioStore కూడా ఉంది. ల్యాప్‌టాప్‌లో ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. రిలయన్స్ జియో ఒక్కసారి ఛార్జ్‌పై 8 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదని పేర్కొంది. వేడి తగ్గించేందుకు కూలింగ్ సపోర్టు కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, HDMI మినీ, Wi-Fi మరిన్ని ఉన్నాయి. ఈ డివైజ్ నుంచి ఎంబెడెడ్ Jio SIM కార్డ్‌తో వస్తుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)