HC Dismisses Twitter Plea: 45 రోజుల్లోగా రూ. 50 లక్షలు చెల్లించాలని ట్విట్టర్‌కు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు, ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం

కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ సంస్థ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ఆ సంస్థ‌పై 50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది.

Karnataka High Court (Photo Credits: Wikimedia Commons)

Karnataka High Court Dismisses Twitter's Plea: క‌ర్నాట‌క హైకోర్టు ట్విట్ట‌ర్ (Twitter) సంస్థ‌కు భారీ షాక్ ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ సంస్థ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ఆ సంస్థ‌పై 50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. 45 రోజుల్లోగా క‌ర్నాట‌క లీగ‌ల్ సెల్ స‌ర్వీసెస్‌కు 50 ల‌క్ష‌లు చెల్లించాల‌ని కోర్టు ట్విట్ట‌ర్‌ను ఆదేశించింది.

2021 ఫిబ్ర‌వ‌రి నుంచి 2022 మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం ప‌దిసార్లు ట్విట్ట‌ర్‌ను బ్లాక్ చేయాల‌ని ఆదేశించినట్లు ట్విట్ట‌ర్ త‌న పిటీష‌న్‌లో పేర్కొన్న‌ది. మ‌రో 39 యూఆర్ఎల్స్‌ను కూడా తీసివేయాల‌ని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది. అయితే ఆ ఆదేశాల‌ను త‌ప్పుప‌డుతూ ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను జ‌స్టిస్ కృష్ణ దీక్షిత కొట్టిపారేశారు.

మెట్రో రైలులో రెండు మద్యం బాటిళ్లు తీసుకువెళ్లవచ్చు, మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధం, నెటిజన్‌కు సమాధానం ఇచ్చిన డీఎమ్‌ఆర్‌సీ

కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా ఎటువంటి వివ‌ర‌ణ‌ను ట్విట్ట‌ర్ సంస్థ ఇవ్వ‌లేద‌ని న్యాయ‌మూర్తి దీక్షిత్ తెలిపారు.జ‌స్టిస్ దీక్షిత త‌న తీర్పులో కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను స‌మ‌ర్ధించారు. ట్వీట్ల‌ను, అకౌంట్ల‌ను బ్లాక్ చేసే అధికారం ప్ర‌భుత్వానికి ఉంద‌న్నారు



సంబంధిత వార్తలు