Subramanian’s 90-Hour Work Row: ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వ్యాఖ్యల దుమారం, ఖండించిన హర్ష్ గోయెంకాతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకునే
ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్ (L&T Chairman) ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి.
ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్ (L&T Chairman) ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి. ‘ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తారు..? ఎంతసేపని భార్య ముఖం తదేకంగా చూడగలరు? ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణె (Deepika Padukone) సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.సుబ్రహ్మణ్యన్ స్టేట్‌మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ..ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం షాకింగ్‌గా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌కు #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. తద్వారా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమనే రీతిలో దీపిక అభిప్రాయం వ్యక్తం చేసింది.
Harsh Goenka on Subramanian’s 90-Hour Work Comment
Deepika Padukone on Subramanian’s 90-Hour Work Comment
ఆర్పీజీ గ్రూప్ చైర్‌పర్సన్ హర్ష్ గోయెంకా కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. “వారానికి 90 గంటలు? ఆదివారంను 'సన్-డ్యూటీ'గా మార్చకూడదు. 'డే ఆఫ్' అనేది ఒక పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు! కష్టపడి, తెలివిగా పని చేయడం నేను నమ్ముతాను, కానీ జీవితాన్ని శాశ్వతమైన ఆఫీస్ షిఫ్ట్‌గా మార్చుకోవాలా? ఇది బర్న్‌అవుట్ కోసం ఒక రెసిపీ, విజయం కాదు. పని-జీవిత సమతుల్యత ఐచ్ఛికం కాదు, ఇది అవసరం ఇది నా అభిప్రాయం అంటూ #WorkSmartNotSlave ట్యాగ్ తో గోయెంకా Xలో పోస్ట్ చేసారు.
సుబ్రహ్మణ్యన్ ఏమన్నారంటే..
ఎల్‌అండ్‌టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్‌లైన్‌లో సుబ్రహ్మణ్యన్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు.దీనిపై ఆయన సమాధానమిస్తూ..ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను. మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతాను. ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు’ అని ఆయన వ్యాఖ్యానించారు. వారానికి 90 గంటలు పని చేయాలని సైతం ఆయన సెలవిచ్చారు.
తాను ఒక చైనా వ్యక్తితో మాట్లాడానని, చైనా కార్మికులు వారానికి 90 గంటలు పని చేస్తారని, అమెరికన్లు 50 గంటలే పని చేస్తారు కాబట్టి కొన్ని రోజుల్లో అమెరికాను చైనా దాటేస్తుందని ఆ వ్యక్తి చెప్పినట్టు సుబ్రహ్మణ్యన్ చెప్పుకొచ్చారు. ‘మీరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాల్సిందే. ముందుకొచ్చి పని చేయండి’ అని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై చాలా మంది వినియోగదారులు రోజుకు 70 గంటలు పని చేయడం గురించి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు మూర్తి చేసిన ప్రకటనతో దీనిని పోల్చారు.
కాగా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితేమే. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్’ అనే పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్‌లో నారాయణమూర్తి మాట్లాడుతూ..భారత్ వారానికి ఆరు పనిదినాల నుంచి ఐదు రోజుల పనికి మారడంపై నేను తీవ్ర అసంతృప్తిగా ఉన్నా. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై నాకు నమ్మకం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు విశ్రాంతి తీసుకోవడం కాదు త్యాగాలు చేయాలి. నేను ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకే ఆఫీసుకు వెళ్లి.. రాత్రి 8.40 గంటలకు బయటికొస్తా. వారానికి ఆరున్నర రోజులు పనిచేస్తా’’ అని వ్యాఖ్యానించారు.రెండో ప్రపంచయుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలాగే శ్రమించాలని అన్నారు.
ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మండిపడ్డారు. సుదీర్ఘంగా పనిచేయడం అనేది అర్థరహితం. దానికి బదులుగా సమర్థతపై దృష్టిపెట్టాలి. అసమర్థమైన, నాసిరకం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను ఎదుర్కొంటూ మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా సాగుతోంది. మంచి సామాజిక క్రమం, సామరస్య పరిస్థితుల కోసం వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. వాస్తవానికి మనం వారానికి 4 రోజుల పని విధానానికి మారాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల కల్లా పని ముగియాలి’’ అని అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)