Lava Yuva 2 5G: లావా నుంచి మ‌రో బ‌డ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్, కేవ‌లం రూ.9500కే ఎన్నో ఫీచ‌ర్స్ తో ఫోన్ రిలీజ్

ఏఐ బ్యాక్డ్ ఫీచర్లతో 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. యాప్ అలర్ట్స్ లేదా షోయింగ్ సిస్టమ్ కోసం నోటిఫికేషన్ లైట్ ఫీచర్ జత చేశారు. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది

Lava Yuva 2 5G (Photo Credits: X/@LavaMobile)

Mumbai, DEC 27: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) శుక్రవారం భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా యువ 2 5జీ (Lava Yuva 2 5G) ఆవిష్కరించింది. ఏఐ బ్యాక్డ్ ఫీచర్లతో 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. యాప్ అలర్ట్స్ లేదా షోయింగ్ సిస్టమ్ కోసం నోటిఫికేషన్ లైట్ ఫీచర్ జత చేశారు. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. గత మే నెలలో భారత్ మార్కెట్లో లావా యువ 5జీ ఫస్ట్ జనరేషన్ ఫోన్ ఆవిష్కరించారు. లావా యువ2 5జీ (Lava Yuva 2 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,499 పలుకుతుంది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో విక్రయిస్తారా? లేదా? తెలియదు. మార్బుల్ బ్లాక్, మార్బుల్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఏడాది వారంటీతోపాటు ఫ్రీ @ హోం సర్వీస్ లభిస్తుంది. 700 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్ ఉంటాయి. యూనిసోక్ టీ760 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్‫‌గా ఫోన్ ర్యామ్ మరో 4 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు

Poco M7 Pro 5G: పోకో నుంచి అదిరే ఫీచర్లతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు, పోకో ఎం7 ప్రో 5జీ,పోకో సీ7 5జీ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి 

లావా యువ2 5జీ (Lava Yuva 2 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుంది. ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రేర్ కెమెరా మాడ్యుల్‌తోపాటు నోటిఫికేషన్ లైట్ యూనిట్ ఉంటుంది. 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డ్యుయల్ స్టీరియో స్పీకర్ యూనిట్ ఉంటది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింగ్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటాయి.