WhatsApp Update: వాట్సాప్ స్టేటస్‌లో కీలక మార్పు, ఇకపై వీడియోల నిడివి 15 సెకన్లకే పరిమితం, ఇకపై స్టేటస్ ద్వారా 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే షేర్ చేయలేరు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ (Lockdown) పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్ లో అప్‌లోడ్ చేసే వీడియోల నిడివిని (Status video) సగానికి కుదించింది. వాట్సాప్ వినియోగంలో వస్తున్న అంతరాయాన్ని నివారించే చర్యల్లో భాగంగా దీన్ని15 సెకన్లకు (15 seconds) పరిమితం చేసింది.
Mumbai, Mar 30: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ (WhatsApp) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ (Lockdown) పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్ లో అప్‌లోడ్ చేసే వీడియోల నిడివిని (Status video) సగానికి కుదించింది. వాట్సాప్ వినియోగంలో వస్తున్న అంతరాయాన్ని నివారించే చర్యల్లో భాగంగా దీన్ని15 సెకన్లకు (15 seconds) పరిమితం చేసింది.
అంతకుముందు ఇది 30 సెకన్లుగా ఉంది. వినియోగదారులు పెద్ద సంఖ్యలో వీడియోలను వీక్షిస్తున్న కారణంగా ఇంటర్నెట్ వేగం ప్రభావితమవుతోందని, అందులో భాగంగానే తగ్గించామని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ 'స్టేటస్' సెక్షన్ కింద షేర్ చేసే వీడియోల వ్యవధిని తగ్గించిందని వాబేటా ఇన్ఫో ట్విటర్ ద్వారా వెల్లడించింది.
తాజా నిర్ణయం ప్రకారం భారతీయ వినియోగదారులు ఇకపై 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే వీడియోలను వాట్సాప్ స్టేటస్ ద్వారా షేర్ చేయలేరు. 15 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలు మాత్రమే అనుమతించబడతాయి. సాధారణంగా వాట్సాప్ స్టేటస్ లో పలు వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్టేటస్ లో షేర్ చేసిన ఇమేజ్ లు, జిఫ్స్, లేదా వీడియోలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా అదృశ్యమవుతాయి.
వాట్సాప్ స్టేటస్ ను ప్రారంభించినపుడు 90 సెకన్ల నుండి మూడు నిమిషాల వీడియోలను అనుమతించింది. ఆ తరువాత, దీన్ని 30 సెకన్లకు తగ్గించింది. ఇప్పుడు 15 సెకన్లకు కుదించింది. భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు.