WhatsApp’s hidden feature: Even without blue tick, you can know if your message is read or not(Photo-pixabay)

Mumbai, Febuary 24: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Facebook) సొంతమయిన వాట్సాప్ (WhatsApp) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను ప్రవేశపెట్టిన ఈ దిగ్గజం తాజాగా మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

కొత్త మెసేజ్ ప్రకారం అవతలి వారు బ్లూ ట్రిక్ ఆప్ చేసుకున్నా మీకు బ్లూ ట్రిక్ మార్క్ కనిపిస్తుంది. సాధారణంగా వాట్సాప్‌లో మనం పోస్ట్‌ చేసిన మెసేజ్‌ ఎవరైనా చదివారా లేదా అని తెలుసుకోవటానికి మెసేజ్‌ దగ్గర బ్లూటిక్స్‌ ఉన్నాయా లేదో చెక్‌ చేసుకుంటాం.

మన మెసేజ్‌కు అవతలి వారు రెస్పాండ్‌ అవుతారా లేదా అన్నది పక్కనపెడితే వాళ్లు మన మెసేజ్‌ (Message) చదివారన్నది మాత్రం తెలిసిపోతుంది. ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్‌ (Blue tick) ఆప్షన్‌ ఆఫ్‌ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్‌ చదివారో లేదో తెలుసుకోవటం కష్టం.

ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ 2014లో వాడుకలోకి తెచ్చింది. బ్లూటిక్స్‌ పడ్డాయంటే ఎదుటివ్యక్తి మన మెసేజ్‌ చదివాడని అర్థం. ఆ తర్వాత వాట్సాప్‌ వన్‌టిక్‌ ఆప్షన్‌ను (One Tick Option) తీసుకొచ్చింది. ఎదుటి వ్యక్తిని మన మెసేజ్‌ చేరగానే వన్‌టిక్‌ పడుతుంది. అయితే దాన్ని తర్వాత గ్రే కలర్‌లోకి మార్చేసింది.

ఇక బ్లూటిక్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసిన వ్యక్తి మీ మెసేజ్‌ చదివాడో లేదో తెలుసుకోవాలంటే... మీరు చాటింగ్‌ చేస్తున్న వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినట్లైతే.. వారికి ఓ వాయిస్‌ మెసేజ్‌ చేయండి. ఆ వ్యక్తి మీ వాయిస్‌ రికార్డింగ్‌ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్‌ పడిపోతాయి.

అతడు బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినప్పటికి వాయిస్‌ మెసేజ్‌ విన్నప్పుడు మాత్రం బ్లూటిక్స్‌ పడిపోతాయి. ఇది ఒకరకంగా వాట్సాప్‌లోని లోపమని చెప్పొచ్చు. గత సంవత్సరమే ఈ సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది.