Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయడం లేదని వార్తలు వస్తున్నాయి.
27 ఏళ్ళ తరువాత ఇంటర్నెట్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (Internet Explorer) కథ ముగిసింది. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయడం లేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీ దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఎక్స్‌ప్లోరర్ సేవల్ని (Microsoft kills Internet Explorer) ఆపేస్తోంది. ఇంటర్నెట్ వాడకం వచ్చిన కొత్తలో బ్రౌజర్ల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ టైంలో.. 1995 ఆగష్టులో విండోస్ 95 ప్యాకేజీ ద్వారా మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. దానిని ఫ్రీగా అందించింది.
2003లో ఇంటర్నెట్ బ్రౌజర్‌లలో 95 శాతం వాడకం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌దే. అయితే ఆ తర్వాతి కాలంలో ఇతర బ్రౌజర్ల పోటీతత్వం నడుమ ఆ పొజిషన్‌ను కాపాడుకోలేకపోయింది. బ్రౌజర్ మార్కెట్‌లో స్మూత్ పర్‌ఫార్మెన్స్, ఇంటర్నెట్ స్పీడ్ ఇలా రకరకాల కారణాలతో పోటీతత్వంలోనూ ఎక్స్‌ప్లోరర్ వెనుకబడిపోయింది.దీంతో.. డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్లలో జస్ట్ ఒక డీఫాల్ట్ బ్రౌజర్‌గా మిగిలిపోయింది. 2016 నుంచి మైక్రోసాప్ట్ కొత్త బ్రౌజర్ ఫీచర్‌ను డెవలప్‌మెంట్ చేయడం ఆపేసింది. ఈ టెక్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించుకోవడం అదే మొదటిసారి.
Here's Tweets
ఎక్స్‌ఫ్లోరర్ స్థానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటోంది. ఇది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ కంటే సురక్షితమైన బ్రౌజింగ్ అని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామర్ మేనేజర్ సీన్ లిండర్‌సే చెప్తున్నారు. ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ ‘నైంటీస్, 2000వ’ దశకంలో ఎంతో మంది ఇంటర్నెట్ యూజర్లతో అనుబంధం పెనవేసుకుపోయింది. అందుకే విషయం తెలియగానే.. చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.