Moto G24 Power: పవర్‌ఫుల్ ఫీచర్లతో మోటోరోలా నుంచి మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల, దీని ధరెంతో తెలుసుకోండి!
Motorola Moto G24 Power: మొబైల్ తయారీదారు Motorola తాజాగా Moto G24 పవర్ పేరుతో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వివిధ వేరియంట్లలో, అందుబాటు ధరల్లోనే లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌లో దీని పేరుకు తగ్గట్లు పవర్ ఫుల్ ఫీచర్లు ఉన్నాయి.
కొత్త Moto G24 పవర్ ఫోన్‌లో MediaTek Helio చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తున్నారు. 4GB మరియు 8GB ర్యామ్ ఆప్షన్లతో ఈ ఫోన్ లభిస్తుంది. ఇంక్ బ్లూ, గ్లేసియర్ బ్లూ అనే రెండుషేడ్స్‌లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంది.
ఇంకా Moto G24 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద అందివ్వబడ్డాయి.
Moto G24 Power స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
-
90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
-
4GB/8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
-
మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్
-
వెనకవైపు 50MP+ 2 MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్
-
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
-
6000 mAh బ్యాటరీ సామర్థ్యం
కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ స్లాట్, 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. హ్యాండ్‌సెట్ IP52-రేటెడ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది.
ధరలు: 4GB వేరియంట్ ధర రూ. 8,999/- కాగా, 8GB వేరియంట్ ధర రూ. 9,999/- గా నిర్ణయించారు.
ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, Motorola.in సహా ప్రముఖ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. 7 ఫిబ్రవరి 2024 నుండి 12PM నుండి అమ్మకానికి వస్తుంది.