PM Modi's YouTube Channel: ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ మరో ప్రపంచ రికార్డు, కోటి వ్యూస్ కొల్లగొట్టిన అయోధ్య రామమందిరం లైవ్ స్ట్రీమ్
లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్‌గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ లో లైవ్ స్ట్రీమ్ అయిన అయోధ్యలోని రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్‌గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది. తొమ్మిది మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా జనం ప్రత్యక్షంగా వీక్షించారు. అన్ని యూట్యూబ్ ఛానళ్ల లైవ్ స్ట్రీమ్ వీక్షణలలో ఇదే అత్యధిక రికార్డ్‌గా నిలిచింది.
నరేంద్ర మోదీ ఛానెల్‌లో రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక ‘PM Modi LIVE | Ayodhya Ram Mandir LIVE | Shri Ram Lalla Pran Pratishtha’ and ‘Shri Ram Lalla Pran Pratishtha LIVE’ టైటిల్స్‌తో ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ లైవ్‌కి ఇప్పటివరకు మొత్తం ఒక కోటి వ్యూస్ వచ్చాయి. అంతకుముందు ఇదే ఛానల్‌లో ప్రసారమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని 80 లక్షల మందికి పైగా జనం వీక్షించారు. ఈ రికార్డులలో మూడవ స్థానంలో ఫిఫా వరల్డ్ కప్ 2023 మ్యాచ్, నాలుగవ స్థానంలో యాపిల్ లాంచ్ ఈవెంట్ నిలిచాయి.
సామాన్యులకు బాల రాముడి దర్శనం, ఐడీ కార్డు తప్పనిసరి, భక్తుల దర్శనం టైమింగ్స్ పూర్తి వివరాలు ఇవిగో..
నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.1 కోట్లు. ఇప్పటివరకూ ఈ ఛానల్‌లో మొత్తం 23,750 వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోల మొత్తం వీక్షణలు 472 కోట్లు. యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్‌లను దక్కించుకున్న ప్రపంచంలోని మొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు.