Financial Fraud in India: భారత్ లో ప్రతీ ఇద్దరిలో ఒకరు ఆర్థిక మోసాలతో నష్టపోయినవారే.. లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి
గడిచిన మూడు సంవత్సరాల్లో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాల బారినపడ్డారని తేలింది.
Newdelhi, June 15: సాంకేతికత (Technology) పెరుగుతుండటంతో ఆర్ధిక మోసాలు (Financial Fraud in India) అంతకు మించి విజ్రుంభిస్తున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల్లో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాల బారినపడ్డారని తేలింది. యూపీఐ, క్రెడిట్ కార్డ్ మోసాలే అధికంగా జరిగాయని పేర్కొన్నది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 302 జిల్లాల నుంచి 23,000 మంది అభిప్రాయాలతో లోకల్ సర్కిల్స్ ఈ సర్వేను చేపట్టింది.
సర్వేలో తేలిన మోసాలు ఇలా..
- సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది తాము లేదా తమ కుటుంబ సభ్యులు క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మోసపోయామని తెలిపారు.
- 36 శాతం మంది యూపీఐ లావాదేవీల్లో నష్టపోయామని వెల్లడించారు.