iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్ తెప్పిస్తున్నారా? అయితే మీరు మోసపోయినట్లే, ఏయే దేశాల్లో ఐఫోన్ 14 తక్కువ ధరకు వస్తుందో తెలుసా? ఇండియా కంటే ఈ దేశాల్లో ఐఫోన్ 14 చాలా తక్కువ చౌక
కెనడా, జపాన్‌లో స్నేహితులు లేదా బంధువులు ఉంటే అదృష్టం. లేకుంటే, మీరు కొంచెం అదనంగా ఖర్చు చేసి భారత్ మార్కెట్లో iPhone మోడల్‌ని కొనుగోలు చేయవచ్చు.
New Delhi, SEP 17: ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లలో ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) ప్రవేశపెట్టింది. ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ (Apple Far Out Event) సందర్భంగా ఆపిల్ లేటెస్ట్ ప్రొడక్టులను గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) సేల్ ఈ రోజు (సెప్టెంబర్ 16) నుంచి ప్రారంభమైంది. భారత్ మార్కెట్లో ఐఫోన్ మోడల్ బేస్ 128GB స్టోరేజ్ రూ.79,900 ధరతో ప్రారంభమైంది. కానీ, మనదేశంలో ఐఫోన్ 14 ధర (iPhone 14 Series Price sale) చాలా దేశాల కన్నా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ప్రతి ఏడాదిలో కొన్నేళ్లుగా భారతీయ యూజర్లు అమెరికాలో ఉంటున్న తమ బంధువులు/స్నేహితుల ద్వారా తక్కువ ధరకే ఐఫోన్‌లను కొని తెప్పించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. అమెరికాలో iPhone 14 ధర చౌకైనదిగా చెప్పవచ్చు. అందుకే భారతీయులు అమెరికాలో ఐఫోన్ 14 సిరీస్ చౌకైన ధరకే సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అమెరికా నుంచి ఈ 2022 ఏడాదిలో iPhoneలను కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే.. అమెరికాలోని ఐఫోన్ 14 సిరీస్ మోడల్‌లు సిమ్ ట్రే (SIM Tray) లేకుండా వస్తాయి. eSIMకు మాత్రమే సపోర్టు ఇస్తున్నాయి. అమెరికా నుంచి iPhone 14 మోడల్‌లలో ఏ మోడల్ కొనుగోలు చేసినా.. మీ ఫిజికల్ SIM కార్డ్‌ని ఉపయోగించలేరని గుర్తించుకోండి. మీరు మొదటి రోజు నుంచి eSIM సపోర్ట్‌ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఐఫోన్ 13 ఓల్డ్ ఐఫోన్ మోడల్‌లో eSIM సపోర్ట్ అందుబాటులో ఉంది. ఈ డివైజ్‌లో ఫిజికల్ సిమ్ స్లాట్ (SIM Card Slot) కూడా ఉంది. కానీ, ఐఫోన్ 14 సిరీస్ మోడలలో మాత్రం సిమ్ ఆప్షన్ లేదు. అందుకే అమెరికాలో ఐఫోన్ 14 సిరీస్ కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు.
ఐఫోన్ 14 సిరీస్‌ను తక్కువ ధరకే పొందాలంటే అమెరికా మినహా ఇతర దేశాల్లో కొనుగోలు చేయవచ్చు. అందులో జపాన్ లేదా కెనడా నుంచి ఐఫోన్ 14 సిరీస్ చాలా చౌకైన ధరకే లభిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఐఫోన్ 14 భారత మార్కెట్లో కన్నా చాలా తక్కువ ధరకు లభిస్తుంది. వాస్తవానికి.. ఈ దేశాలలో ఐఫోన్ 14 ధర అమెరికా ధరకు దాదాపు దగ్గరగా ఉందని గుర్తించాలి. భారత మార్కెట్‌తో పోల్చినప్పుడు ఐఫోన్ 14 కెనడాలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీరు కెనడాలో రూ. 67,068 (సుమారు) ప్రారంభ ధరకు iPhone 14 Series పొందవచ్చు. ఐఫోన్ 14 తక్కువ ధరకు లభించే మరో దేశం జపాన్ కూడా ఉంది. జపాన్‌లోనూ మీరు ఐఫోన్ 14ని రూ. 67,000 (సుమారు) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీరు సిమ్ ట్రే (SIM Tray) లేకుండా కావాలనుకుంటే.. యునైటెడ్ స్టేట్స్ నుంచి iPhone 14ని కొనుగోలు చేయండి. అమెరికాలో ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 63,601(సుమారుగా) ఉంటుంది. eSIMని యాక్టివేట్ చేసే లేదా ఎనేబుల్ చేసే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కానీ, ఇది టెలికం ఆపరేటర్ నుంచి ఆపరేటర్‌కు మారుతూ ఉంటుంది. భారత్‌లో ప్రస్తుతం (ఎయిర్ టెల్) Airtel, Reliance Jio (రిలయన్స్ జియో) ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో eSIMకి సపోర్టు అందిస్తున్నాయి. అయితే Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మాత్రమే eSIM ఆప్షన్‌ను అందిస్తోంది. మీ ఫోన్ నంబర్‌లో eSIMని ప్రారంభించేందుకు ప్రయత్నించండి.
మీరు అమెరికాలో లేదా.. కెనడా, జపాన్‌లో స్నేహితులు లేదా బంధువులు ఉంటే అదృష్టం. లేకుంటే, మీరు కొంచెం అదనంగా ఖర్చు చేసి భారత్ మార్కెట్లో iPhone మోడల్‌ని కొనుగోలు చేయవచ్చు. దేశంలో సెప్టెంబర్ 16 ఆపిల్ ఇండియా స్టోర్ (Apple India Store), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon), అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ఐఫోన్ 14 సిరీస్ సేల్ అందుబాటులో ఉంటుంది.