Google Chrome (Photo Credits: Google Chrome Twitter)

New Delhi, SEP 07: మీరు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను (Chrome) వాడుతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. వీలైనంత మేరకు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ (New Version) చేసుకోండి. లేకుంటే ఇబ్బందులుపడక తప్పదు. క్రోమ్‌ బ్రౌజర్‌ (వర్షన్‌ 105.0.5195.102)లో కొత్త బగ్‌ను గూగుల్‌ను గుర్తించింది. ఈ మేరకు వినియోగదారులకు అలెర్ట్‌ను (Alert) జారీ చేసింది. బగ్‌ సమస్య నుంచి బయటపడేందుకు కొత్తగా అప్‌డేట్‌ను విడుదల చేసింది. విండోస్‌, మ్యాక్‌, లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో గూగుల్‌ క్రోమ్‌ వినియోగదారుల కోసం సెక్యూరిటీ ప్యాచ్‌ను (Security patch) విడుదల చేసినట్లు తెలిపింది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. హ్యాకింగ్ ముప్పును నివారించడానికి క్రోమ్‌ను త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు గూగుల్‌ సూచించింది. CVE-2022-3075 బగ్‌ బ్రౌజర్‌లో గుర్తించగా.. గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 105ను ఆగస్టు 30న విడుదల చేసిన కొన్ని రోజులకే తాజా అప్‌డేట్‌ను ఇచ్చింది.

Google New Bug Bounty Program: బగ్‌ కనిపెడితే రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీ, బగ్స్‌ కనిపెట్టే ప్రోగ్రాం మొదలుపెట్టిన గూగుల్, మీరు ఈ రివార్డులు పొందాలంటే ఏం చేయాలో తెలుసా? 

సెక్యూరిటీ బగ్‌లు చేరకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇతర ప్రాజెక్టులపై ఆధారపడి థర్డ్‌ పార్టీ లైబ్రరీలో బగ్‌ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని, అలాంటి చర్యలు చేపడుతామని పేర్కొంది. Google Chrome బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం తేలికేనని.. ఇందులో ఎలాంటి సమస్యలుండవని గూగుల్‌ పేర్కొంది.

App detects Covid: కరోనా వైరస్ గుట్టు చెప్పేసే యాప్.. గొంతు సాయంతో వైరస్ సోకిందో.. లేదో ఇట్టే చెప్పేయొచ్చు.. 

‘గూగుల్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత ఎడమ వైపు పైనున్న మూడుచుక్కలపై క్లిక్‌ చేయాలి. తర్వాత సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఎబౌట్‌ గూగుల్‌ క్రోమ్‌పై క్లిక్‌ చేస్తే అప్‌డేట్‌ అవుతుంది’ అని తెలిపింది.