Apple iPhone 14 Series (Photo Credits: Apple)

ఐఫోన్ అభియానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 14సిరీస్ ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయింది. భారత కాలమానం ప్రకారం..బుధవారం రాత్రి 10.30 గంటలకు 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్లో ఈ సీరిస్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల‌ను భారత్ లో విడుదల చేశారు. ఐఫోన్ 14 (Iphone 14), ఐఫోన్ 14 ప్లస్‌ (Iphone 14 Plus) ఫోన్ ధ‌ర‌ల‌తో పాటు, ఆ ఫోన్‌ల‌లో ఉండే..ముఖ్యంగా ఈ-సిమ్స్‌,శాటిలైట్ క‌నెక్టివిటీ,యానిమేష‌న్ రూపంలో నోటిఫికేష‌న్ వంటి అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో అవి మార్కెట్లోకి వచ్చేశాయి.

యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 India) ఫోన్‌ల‌లో eSIMని పరిచయం చేసింది. త‌ద్వారా ఎక్కువ సంఖ్య‌లో eSIMలను స్టోర్ చేసుకోవ‌డానికి, సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి ఒక్క యూఎస్ ఐఫోన్ 14 సిరీస్‌లో మాత్ర‌మే ఈ ఈ-సిమ్ సౌక‌ర్యం ఉంది. ఎందుకంటే ఆ మోడ‌ళ్ల‌లో ఫిజిక‌ల్ సిమ్ కార్డ్ పెట్టుకునే సిమ్ ట్రేస్‌లు లేవు.యాపిల్ తన ఐఫోన్‌లో మొదటిసారి శాటిలైట్ కనెక్టివిటీని పరిచయం చేసింది.

దీని ద్వాారా ఐఫోన్ 14 వినియోగదారులు  అత్యవసర పరిస్థితుల్లో ఈ శాటిలైట్ కనెక్టివిటీ సాయంతో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవ‌చ్చు. గేమ్ ఛేంజ్ టెక్నాలజీని కమ్యూనికేషన్ ప్రవేశపెట్టడానికి తమకు సంవత్సరాలు పట్టిందని యాపిల్ తెలిపింది.ఐఫోన్ 14 చిన్న పిల్ ఆకారపు నాచ్‌తో కొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. డిస్ ప్లే వెనుక భాగంలో ప్రాక్సిమిటీ సెన్సార్, నోటిఫికేషన్‌లు యానిమేషన్ రూపంలో పాప్ అవుట్ అవుతాయి.

గూగుల్ క్రోమ్ యూజర్స్‌ కు అలర్ట్, వెంటనే యాప్‌ అప్‌డేట్ చేసుకోకపోతే రిస్క్‌లో పడ్డట్లే, మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు ఈ విధంగా చేయండి

ఇక ఫీచర్ల విషయానికి వస్తే..ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాల‌ర్లు (సుమారు రూ. 79,900) ఉండ‌గా, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర 899 డాల‌ర్లు (సుమారు రూ.89,900)గా ఉంది. ఈఫోన్‌ల ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16న, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి అందుబాటులో ఉంటుంది. న‌వంబ‌ర్ నాటికి ఈ ఫోన్‌లు అమెరికా, కెన‌డా కొనుగోలు దారుల‌కు అంద‌నున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్ల‌స్ మిడ్ నైట్ స్టార్‌లైట్‌, ప‌ర్పుల్‌, రెడ్ వంటి ఐయిదు వేరియంట్‌ క‌ల్స‌ర్‌లో ల‌భ్యం కానుంది. ఈ ఫోన్‌ల‌లో ఏ15 బయోనిక్ చిప్, 6-కోర్ సీపీయూతో రెండు హై ఫ‌ర్మామెన్స్‌తో నాలుగు ఎఫెషెన్స్ కోర్లు, ఒక న్యూరల్ ఇంజిన్ ఉంది. ఐఫోన్ 14 లార్జ‌ర్ సెన్సార్ల‌తో 12ఎంపీ మెయిన్ కెమెరా, 1.9 మైక్రాన్ పిక్సెల్స్‌, F1.5 ఎప‌ర్చ్యూర్ (కెమెరా హోల్‌) OISతో వస్తుంది.