Prophet Row: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కలకలం, భారత్‌పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్‌సైట్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు
మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది.
New Delhi, June 13: గత వారం నుంచి మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు (Prophet Row) తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ప్రపంచంలోని మెజార్టీ ముస్లీం దేశాలు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్‌సైట్లను (70 Indian Government And Private Websites) సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది. మీ ఫోన్ పోయిందా.. వెంటనే ఇలా చేయకపోతే ప్రమాదంలో పడిపోతారు, ఫోన్ ఎవరి చేతిలోనైనా పడితే చాలా డేంజర్, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌టెన్షన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లతో పాటు పలు ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లపై సైబర్ దాడులు చేశారు. దాదాపు 70 వెబ్‌సైట్లను, పోర్టల్స్‌ను హ్యాక్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్ వంటి ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.