PUBG Mobile India: ఇండియాకు పబ్‌జీ రీ ఎంట్రి, పబ్‌జీ మొబైల్ ఇండియా పేరుతో టీజర్ విడుదల, భారత గేమింగ్ పరిశ్రమలో రూ.700 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చిన పబ్‌జీ కార్పొరేషన్
పబ్‌జీ గేమ్ తిరిగి భారత్ లోకి "పబ్‌జీ మొబైల్ ఇండియా" (PUBG Mobile India) పేరుతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. కొత్తగా తీసుకొచ్చిన పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ (Battle Royale Online Game) ను భారత మార్కెట్‌కు తగ్గట్టుగా పబ్‌జీ కార్పొరేషన్ డిజైన్ చేస్తోంది.
పబ్‌జీ ప్రేమికులకు కంపెనీ శుభవార్తను అందించింది. పబ్‌జీ గేమ్ తిరిగి భారత్ లోకి "పబ్‌జీ మొబైల్ ఇండియా" (PUBG Mobile India) పేరుతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. కొత్తగా తీసుకొచ్చిన పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ (Battle Royale Online Game) ను భారత మార్కెట్‌కు తగ్గట్టుగా పబ్‌జీ కార్పొరేషన్ డిజైన్ చేస్తోంది. దీంతో పాటుగా భారత గేమింగ్ పరిశ్రమలో సుమారు రూ.700 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని హామీ కూడా ఇచ్చింది.
తాజాగా యూట్యూబ్‌లో పబ్‌జీ మొబైల్ ఇండియా టీజర్ ను రిలీజ్ చేసింది. కాగా రిలీజైన కొద్ది సేపటికే పబ్‌జీ మొబైల్ ఇండియా టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ టీజర్‌కు ఇప్పటికే 39 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే పబ్‌జీ గేమ్‌కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశం వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించడంతో పాటు దేశం వెలుపల ఉన్న సర్వర్లకు చేరవస్తున్నాయనే కారణంతో చైనాకు చెందిన పబ్‌జీ, 117 ఇతర చైనా యాప్స్ ను భారత్ ప్రభుత్వం ఆగస్టులో నిషేధించింది.
PUBG Corporation Tweet
ఈసారి భారతదేశంలోని ఆటగాళ్ల గోప్యత, భద్రతను కాపాడటానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో పబ్‌జీ కార్పొరేషన్ (PUBG Corporation) ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా దేశంలోనే సర్వర్లు ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి పబ్‌జీ కార్పొరేషన్ అనేది సౌత్ కొరియాకు చెందిన కంపెనీ. అయితే మొబైల్ వర్షన్ గేమ్ బాధ్యతల్ని గతంలో చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్‌కు అప్పగించింది. ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత పబ్‌జీ మొబైల్ బాధ్యతల నుంచి టెన్సెంట్ గేమ్స్ తప్పుకొంది.
పబ్‌జీ మొబైల్ ఇండియా' గేమ్‌ను భారతదేశంలో రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా పబ్‌జీ కార్పొరేషన్ లోకల్ వీడియో గేమ్, ఇస్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడులు పెడుతోంది .