RBI ATM Cash New Rule: బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్, కస్లమర్లకు భారీ ఊరట, ఏటీఎంలో క్యాష్ లేకుంటే రూ. 10 వేల వరకు పెనాల్టీ, అక్టోబరు ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి
సారీ.. అవుటాఫ్ క్యాష్.. మీకు కలిగిన అంతరాయానికి మన్నించండి. మరో ఏటీఎంను సంప్రదించండి.. అనే మెసేజ్ వస్తుందా.. ఏటీఎంలలో డబ్బు లేనిపక్షంలో సంబంధిత బ్యాంకులకు జరిమానాను (anks To Pay Fines If ATMs Run Out Of Cash) కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలుంటాయి.
మీ బ్యాంకు ఏటీఎంలో నగదు విత్ డ్రాయల్ కోసం వెళితే.. సారీ.. అవుటాఫ్ క్యాష్.. మీకు కలిగిన అంతరాయానికి మన్నించండి. మరో ఏటీఎంను సంప్రదించండి.. అనే మెసేజ్ వస్తుందా.. ఇకపై ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. ఏటీఎంలలో డబ్బు లేనిపక్షంలో సంబంధిత బ్యాంకులు జరిమానా (anks To Pay Fines If ATMs Run Out Of Cash) కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవబోతోంది.
ఇక నుంచి ఏటీఎంల్లో పది గంటలకు పైగా నగదు లేకపోతే సంబంధిత బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లపై రూ. 10 వేల వరకు పెనాల్టీ విధిస్తామని ఆర్‌బిఐ ప్రతిపాదించింది. ఈ మేరకు నూతన నిబంధనలు (RBI ATM Cash New Rule) వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.వివిధ బ్యాంకుల ఏటీఎంలు నగదు లేక ఖాళీగా ఉండటంతో సాధారణ ప్రజానీకం అసౌకర్యానికి గురవుతున్నారని తమ సమీక్షలో తేలిందని మంగళవారం ఆర్బీఐ (Reserve Bank of India) తెలిపింది. సకాలంలో ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండేలా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్ఏవోస్) తమ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించింది.
నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే సంబంధిత బ్యాంకర్లు, ఏటీఎం ఆపరేటర్లపై పెనాల్టీ విధిస్తామని పేర్కొంది. ఆ పెనాల్టీని ఆయా ఏటీఎం వద్ద నుంచి వసూలు చేసే అధికారాన్ని బ్యాంకర్లకే వదిలేస్తున్నట్లు వెల్లడించింది. నోట్ల లభ్యతను పర్యవేక్షించే బాధ్యతను బలోపేతం చేసుకోవాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం(డబ్ల్యూఎల్ఏ) ఆపరేటర్లను ఆదేశించింది. ఇకపై ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించింది.
ఏటీఎంలలో నగదు లేని సమయం ఒక నెలలో 10 గంటలు దాటితే రూ. 10 వేల మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించిన ఆర్‌బీఐ... అక్టోబరు ఒకటో తేదీ నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే వాటికి డబ్బు అందజేసే బాధ్యత నిర్వహించే బ్యాంకులకు జరిమానా తప్పదని ఆర్‌బీఐ హెచ్చరించింది.