LPG sees price drop of more than Rs 160 per cylinder (Photo-PTI)

ఇప్పుడు మీరు వంట గ్యాస్ (ఎల్పీజీ గ్యాస్‌) బుకింగ్ (LPG Cylinder Booking) చేయడంలో అలాగే కొత్త కనెక్షన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే ఇకపై మీ ఇబ్బందులు తీరినట్టే.. మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 84549 55555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. వెంటనే వంట గ్యాస్ సిలిండ‌ర్ (LPG Cylinder) బుక్ అవుతుంది. దేశంలోనే అతిపెద్ద ముడి చ‌మురు సంస్థ ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఐవోసీ) తమ కస్టమర్లందరికీ ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. మిస్డ్ కాల్ ఫెసిలిటీతో వంట గ్యాస్ క‌నెక్ష‌న్ ప‌థ‌కాన్ని ఐవోసీ చైర్మ‌న్ ఎస్ఎం వైద్య ప్రారంభించారు.

దేశంలో ఎక్క‌డ నివ‌సిస్తున్నా మిస్డ్ కాల్ ఇస్తే వారి ఇంటికే గ్యాస్ క‌నెక్ష‌న్ (give a missed call for a new LPG connection) అందిస్తామ‌ని ఐవోసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌స్ట‌మ‌ర్ల ఇంటి వ‌ద్ద‌కే డ‌బుల్ బాటిల్ (రెండు సిలిండ‌ర్ల‌) క‌నెక్ష‌న్ (డీబీసీ)ను కూడా ప్రారంభించారు. దీని కింద సింగిల్ బాటిల్ (సిలిండ‌ర్) క‌నెక్ష‌న్ (ఎస్బీసీ) క‌స్ట‌మ‌ర్లు త‌మ క‌నెక్ష‌న్‌ను డీబీసీలోకి మార్చుకునేందుకు వెసులుబాటు ల‌భిస్తుంది. ఆస‌క్తి గ‌ల ఖాతాదారులు రెగ్యుల‌ర్ 14.2 కిలోల సిలిండ‌ర్‌కు బ‌దులు ఐదు కిలోల సిలిండ‌ర్‌ను కూడా ఎంచుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఐవోసీ మాత్ర‌మే మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్ లేదా సిలిండ‌ర్ బుకింగ్ అంద‌చేసే ఫెసిలిటీ క‌లిగి ఉన్న‌ది.

బ్యాంక్ చెక్ బుక్ వాడే ఖాతాదారులు వెంటనే అలర్ట్ అవ్వండి, సెలవు రోజుల్లో కూడా చెక్‌లు క్లియరెన్స్, ఆ సమయంలో కనీస బ్యాలన్స్ లేకుంటే భారీ జరిమానా, అన్ని బ్యాంకులకు నియమ నిబంధనలు వర్తిస్తాయని తెలిపిన ఆర్‌బీఐ

గ‌త జ‌న‌వ‌రిలో ఎంపిక చేసిన మార్కెట్ల ప‌రిధిలో మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్‌, దేశ‌వ్యాప్తంగా సిలిండ‌ర్ బుకింగ్ ఫెసిలిటీని ఐవోసీ తీసుకొచ్చింది. మిస్డ్ కాల్ వ‌ల్ల ఖాతాదారుల స‌మ‌యం ఆదా అవుతుంద‌ని ఐవోసీ పేర్కొంది. కొత్త క‌నెక్ష‌న్ కోసం ఉచితంగా, సౌక‌ర్య‌వంతంగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

ఇక భార‌త్ బిల్ పేమెంట్ సిస్ట‌మ్ (బీబీపీఎస్‌), ఇండియ‌న్ ఆయిల్ వ‌న్ యాప్ లేదా https://cx.indianoil.in” అనే పోర్ట‌ల్ ద్వారా గానీ క‌స్ట‌మ‌ర్లు త‌మ ఎల్పీజీ సిలిండ‌ర్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. క‌స్ట‌మ‌ర్లు 75888 88824 అనే వాట్సాప్ నంబ‌ర్‌, 7718955555 అనే నంబ‌ర్‌తో ఎస్సెమ్మెస్‌/ ఐవీఆర్ఎస్ చేసి గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేయొచ్చు.. పేమెంట్ చేయొచ్చు. అమెజాన్ లేదా పేటీఎం చానెళ్ల ద్వారా చెల్లింపులు జ‌రుపొచ్చ‌ని ఐవోసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.