The Reserve Bank of India (RBI) |

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచల నిర్ణయం తీసుకుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (American Express Banking Corp), డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Diners Club International Ltd) సంస్థ‌ల‌పై ఆర్‌బీఐ (Reserve Bank of India) నిషేధం విధించింది. వీటి చెల్లింపు వ్యవస్థ డేటా నిల్వ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ కొత్త దేశీయ క్రెడిట్ కార్డులను వినియోగదారులకు జారీ చేయకుండా నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.

అయితే కార్డ్ నెట్‌వర్క్‌లపై ఆంక్షలు ప్రస్తుత వినియోగదారులపై ప్రభావం చూపదని తెలిపింది. దేశంలోని భారతీయ వినియోగదారుల డాటా, ఇతర సమాచారాన్ని భద్రపరచడానికి నిబంధనలను ఉల్లంఘించడంపై రిజ‌ర్వ్‌ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (పీఎస్ఎస్ యాక్ట్) సెక్షన్‌ 17 కింద కార్డు నెట్‌వర్క్ ఆపరేటింగ్‌కు సంబంధించి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌లకు అనుమతి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూస్తున్నారా..ఈ విషయాలను గమనించకుంటే డేంజర్‌లో పడినట్లే, పోర్న్ వీడియోలు చూసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలపై ఓ లుక్కేసుకోండి

చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించిన అన్ని సర్వీసు ప్రొవైడర్లు, వారు నిర్వహించే చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన డాటా, ఇతర సమాచారాన్ని ఆరు నెలల్లో త‌మ ముందు ఉంచేలా చూడాలని 2018 ఏప్రిల్‌లోసర్క్యులర్ ద్వారా సూచించింది. దీనిపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి ఆర్‌బీఐ కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్త‌ర్వులు ప్రస్తుత భారతీయ కస్టమర్లను ప్రభావితం చేయదని, కార్డులను యథాతధంగా ఉపయోగించవచ్చునని స్పష్టం చేసింది.



సంబంధిత వార్తలు

RBI Shifts 100 Tonnes of Gold from UK: ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం తరలింపు ఎందుకు జరిగిందో తెలుసా? ఇంత మొత్తం పసిడిని ఎక్కడ స్టోర్ చేస్తారంటే..

Bank Holidays In May 2024: మే నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు, ఏయే రోజుల్లో బ్యాంకులు బంద్ అవుతాయో లిస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి

Cash Deposit Facility Via UPI: బ్యాంక్‌కు వెళ్లకుండా యూపీఐతో క్యాష్ డిపాజిట్, ఖాతాదారులకు శుభవార్తను అందించిన ఆర్‌బీఐ, ఎలా చేయాలంటే..

Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఏమేమి ఉన్నాయి, ప్రస్తుతం ఆ పథకాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ పథకంలో చేరితే ప్రయోజనకరం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకుల వడ్డీరేట్ల సమాచారం ఇక్కడ తెలుసుకోండి

Rs 2,000 Notes Update: రెండు వేల నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన, రూ. 8,470 కోట్లకు తగ్గిన నోట్ల సర్క్యులేషన్, ఇంకా చెలామణిలో 2.4 శాతం నోట్లు

Bank Holidays in March 2024: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్.. మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదే!

NHAI Removes Paytm Payments Bank: పేటీఎం బ్యాంకుకి షాకిచ్చిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఫాస్ట్‌ట్యాగ్ సేవల కోసం ఆ బ్యాంకు సర్వీసులు నిలిపివేత

How To Deactivate Paytm Fastag: ఎన్ హెచ్ఏఐ నిర్ణ‌యంతో 2.4 కోట్ల మందికి ఇబ్బంది, పేటీఎం ఫాస్టాగ్ ఎలా డీ యాక్టివేట్ చేసుకోవాలంటే?