Realme 9 Pro Series: టాప్ఎండ్ ఫీచర్ల‌తో రియల్‌మి 9 ప్రో సీరీస్ ఇండియాకు వచ్చేశాయి, ధర, ఫీచర్లు, ఆఫర్లు ఓ సారి చెక్ చేసుకోండి

టాప్ఎండ్ ఫీచర్ల‌తో రియ‌ల్మి 9 ప్రొ ప్ల‌స్ (Realme 9 Pro+) ఖ‌రీదైన ఫోన్‌గా ముందుకు రాగా, రియ‌ల్మి 8 ప్రొకు కొనసాగింపుగా మెరుగైన స్పెసిఫికేష‌న్స్‌తో రియ‌ల్మి 9 ప్రొను కంపెనీ ప్ర‌వేశ‌పెట్టింది.

Realme 9 Pro+, Realme 9 Pro (Photo Credits: Realme)

చైనా దిగ్గజం Realme భారత్‌లో రియ‌ల్మి 9 ప్రొ ప్ల‌స్‌, రియ‌ల్మి 9 ప్రొ మోడ‌ల్స్‌తో 9 ప్రొ సిరీస్‌ను (Realme 9 Pro Series) లాంచ్ చేసింది. టాప్ఎండ్ ఫీచర్ల‌తో రియ‌ల్మి 9 ప్రొ ప్ల‌స్ (Realme 9 Pro+) ఖ‌రీదైన ఫోన్‌గా ముందుకు రాగా, రియ‌ల్మి 8 ప్రొకు కొనసాగింపుగా మెరుగైన స్పెసిఫికేష‌న్స్‌తో రియ‌ల్మి 9 ప్రొను కంపెనీ ప్ర‌వేశ‌పెట్టింది. 5జీ క‌నెక్టివిటీతో రియ‌ల్మి 9 ప్రొ ప్ర‌ధానంగా మిడ్‌-ఎండ్ స్పెసిఫికేష‌న్స్‌పై దృష్టి కేంద్రీక‌రించింది. ప్రొ ప్ల‌స్ వెర్ష‌న్ కంటే రియ‌ల్మి 9 ప్రొ (Realme 9 Pro+, Realme 9 Pro) క‌స్టమ‌ర్లను ఆక‌ట్టుకునేలా ఉంది. రియ‌ల్మి 9 ప్రొ క‌ల‌ర్ షిఫ్ట్ డిజైన్‌తో ఆక‌ట్టుకుంటోంది.

రియ‌ల్మి నెంబ‌ర్ సిరీస్‌ను క‌స్ట‌మ‌ర్లు విశేషంగా ఆద‌రిస్తున్నార‌ని రియ‌ల్మి ఇండియా చీఫ్ మాధ‌వ్ సేధ్ వెల్ల‌డించారు. రియ‌ల్మీ నెంబ‌ర్ సిరీస్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4 కోట్ల మంది యూజ‌ర్లు వాడుతున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రియ‌ల్మి 9 ప్రొ రూ 17,999 నుంచి రూ 20,999 మ‌ధ్య అందుబాటులో ఉండ‌నుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, అరోరా గ్రీన్‌, స‌న్‌రైజ్ బ్లూ క‌ల‌ర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ప్లిఫ్‌కార్ట్‌, రియ‌ల్మి ఆన్‌లైన్ స్టోర్‌, రిటైల్ స్టోర్ల నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి.

50 ఎంపీ రియర్‌ కెమెరా 5జీ ఫోన్ కేవలం రూ. 15,990కే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీని సొంతం, భారత మార్కెట్లో వచ్చేసిన వివో టీ1 5జీ ఫోన్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డు, ఐఎంఐ ఫెసిలిటీ ద్వారా రూ 2000 డిస్కౌంట్ ల‌భిస్తుంద‌ని, ఈఎంఐ వెసులుబాటు ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డ‌వించింది. ఇక ఫోన్ స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే గేమ్స్ ఆడే స‌మ‌యంలో ఈ ఫోన్‌లో ఉండే లిక్విడ్ కూలింగ్ ఉప‌క‌రిస్తుంది. అండ్రాయిడ్ 12 ఆధారిత రియ‌ల్మి యూఐ 3.0పై నడిచే ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్స‌ర్‌, సూప‌ర్ వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా ప్రొఫెష‌న‌ల్ కెమెరామెన్ల‌నూ ఆక‌ట్టుకుంటాయి. 33 డ‌బ్ల్యూ చార్జింగ్ టెక్నాల‌జీకి 5000ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం స‌పోర్ట్ చేయ‌డంతో రియ‌ల్మి 9 ప్రొ దీర్ఘ‌కాలం ప‌నిచేస్తూ, త్వ‌ర‌గా చార్జింగ్ అవుతుంద‌ని కంపెనీ తెలిపింది.