ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా భారత మార్కెట్లో టీ1 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. టీ సిరీస్‌లో ఇది మొదటి స్మార్ట్‌ఫోన్‌ అని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, వివో పోర్టల్, రిటైల్‌ స్టోర్స్‌లో దీని ధర రూ. 15,990 నుంచి రూ. 19,990 వరకూ ఉంటుంది. ప్రత్యేక ఆఫర్లు వినియోగించుకుంటే రూ. 14,990కే పొందవచ్చని వివో వివరించింది. ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలిపింది. రూ. 20,000 లోపు ధరలో ఇది అత్యంత పల్చని స్మార్ట్‌ఫోన్‌ అని పేర్కొంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ ఫోన్‌లో 50 ఎంపీ రియర్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫన్‌టచ్‌ ఓఎస్‌ 12 మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రంగుల్లో (స్ట్రెయిట్‌ బ్లాక్, రెయిన్‌బో ఫ్యాంటసీ) లభిస్తుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)