వివో భారత్ మార్కెట్‌లో వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక ధర కింద రూ. 13,499కి విడుదల చేసింది. బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12,499కే సొంతం చేసుకోవచ్చు. వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో కస్టమర్ల ముందుకొచ్చింది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ వివో స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ కలర్స్‌లో 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజ్‌తో మూడు వేరియంట్లలో లభిస్తుంది. వివో న్యూ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, అన్ని పార్ట్‌నర్ రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌తో రియల్ మీ పీ1 5జీ సీరిస్ ఫోన్లు వచ్చేశాయి, ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Here's News
Introducing the Vivo T3x 5G, equipped with a massive 6,000mAh battery and blazing-fast 44W charging!
Available in Crimson Bliss and Celestial Green, starting at THIS price.#VivoT3x #5G #vivosmartphone @Vivo_India https://t.co/FpZlMjHnRv
— Zee Business (@ZeeBusiness) April 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)